హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

అచ్చు బసవతారకంలానే నిండుగా ఉంది!

అచ్చు బసవతారకంలానే నిండుగా ఉంది!

Category : Uncategorized

ప్రతి మనిషి జీవితంలో కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకుడిని చేసిన గురువులు, ప్రాణస్నేహితులందరు ఒక ఎత్తైతే కట్టుకున్న భార్య మరో ఎత్తు. భార్య గొప్పదనాన్ని తెలిపే డైలాగులు, రచనలు, సినిమాలు ఎన్నో ఉన్నా కూడా వీటిలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘పెదరాయుడు’ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు సౌందర్యని ఉద్దేశించి చెప్పే డైలాగు. మనల్ని నమ్మి మనం ఎవరో తెలియకపోయినా మన మీద ప్రేమతో వచ్చి మన కష్టనష్టాలలో, సుఖసంతోషాలలో తోడుండి మన జీవితాంతం మనతో ప్రయాణం చేసేది భార్య మాత్రమే. పిల్లలు కూడా ఆ తర్వాతే. ఇక స్వర్గీయ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఆయన సహధర్మచారిణి బసవతారకం గురించి ప్రజలకు చాలా కొద్దిగా మాత్రమే తెలుసు. ఆమె ఏనాడు హైప్రోఫైల్‌ మెయిన్‌ టెయిన్‌ చేయడం గానీ, బయటకు, ఫంక్షన్లకు రావడం కానీ చేయలేదు. కానీ రేయింబగళ్లు స్టార్‌ హీరోగా బిజీగా ఉన్న ఎన్టీఆర్‌కి ఆమె చేసిన సేవలు అమోఘం. ఎన్టీఆర్‌ క్రమశిక్షణను, ఆయన మనస్తత్వాన్ని తెలుసుకుని తాను జీవించినంతకాలం ఆయనకు తోడునీడగా నిలిచింది. అంతమంది గంపెడు సంతానానికి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది. 

ఇక ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి ప్రవేశించే సమయంలో కూడా అంతే. ఆమె ఎంతలా ఎన్టీఆర్‌ని చూసుకుంది అంటే తన పక్కన తన భార్య తోడుగా లేనిదే జీవించలేననే విధంగా ఆమె ఆయనకు సేవలందించింది. ఆడవాళ్లైనా భర్త చనిపోతే ఎలాగోలా జీవితాన్ని నెట్టుకురాగలరేమో గానీ భార్య ముందుగా మరణిస్తే తట్టుకునే శక్తి, ఆలోటు పూడ్చుకోవడం అంత సులభం కాదు. కాబట్టే ఎన్టీఆర్‌ తన సంతానం సరిగా చూడకపోయేసరికే తోడు కోసం లక్ష్వీపార్వతిని రెండో వివాహం చేసుకున్నాడని, అందులో ఆయన తప్పేమి లేదని కూడా అంటారు. ఇక బసవతారకం క్యాన్సర్‌తో మరణించింది. దాంతో ఆ ఫ్యామిలీ క్యాన్సర్‌ పీడితుల కోసం బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిని నెలకొల్పారు. 

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ని తీస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్‌ సినీ జీవితంపై, రెండో భాగం ఆయన రాజకీయ పయనంపై ఉండనుంది. మొదటి భాగం సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఏయన్నార్‌గా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ వంటి వారి లుక్స్‌ విడుదలయ్యాయి. తాజాగా బసవతారకంగా నటిస్తోన్న బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ లుక్‌ బయటకు వచ్చింది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కట్టుబొట్టు మార్చుకున్న విద్యాబాలన్‌ బసవతారకమ్మగా తయారైంది. మేకప్‌ విషయంలో మాత్రం పెద్దగా మార్పులేదు. ఇక ఈ పాత్రని ఎంతో ఉన్నతంగా, ఆమె గురించి తెలియని వారికి ఆమె గురించి చెప్పే ప్రయత్నాన్ని క్రిష్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. అద్దం ముందు సింగారించుకుంటున్నట్లు ఉన్న ఈ ఫొటోలో ‘నేనేం చూస్తున్నాను’ అంటూ రాయడం విశేషం.