హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

అత్తారింట్లో దసరా అల్లుడిగా బన్నీ..!

అత్తారింట్లో దసరా అల్లుడిగా బన్నీ..!

Category : Uncategorized

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు తాను ఓ సినిమా చేసేటప్పుడే తదుపరి చిత్రానికి సంబంధించిన హింట్స్‌ ఇచ్చేవాడు. ఇక బన్నీ తదుపరి చిత్రం ఇదేనంటూ మీడియాలో బాగా వార్తలు వచ్చేవి. అవి దాదాపు నిజమే అయ్యేవి. కానీ ‘దువ్వాడ జగన్నాథం’(డిజె) పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేక సగటు కమర్షియల్‌ చిత్రంగానే మిగిలింది. మరోవైపు సుకుమార్‌ తర్వాత స్టార్‌రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీని ఎన్టీఆర్‌ కంటే ఎక్కువగా నమ్మి ‘నా పేరు సూర్య..నా ఇల్లుఇండియా’ చిత్రం చేశాడు. ఇది పెద్ద ఫ్లాప్‌ అయింది. దాంతో ఆయన ‘నాపేరు సూర్య’ చిత్రం పూర్తయి ఇంతకాలం అయినా తన తదుపరి చిత్రాన్ని ఓకే చేయలేదు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, విక్రమ్‌.కె.కుమార్‌లలో ఎవరో ఒకరితో ఈయన తన తదుపరి చిత్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక విషయానికి వస్తే దేశవ్యాప్తంగా అందరు జరుపుకునే అది పెద్ద పండుగ దసరా. మైసూర్‌ నుంచి గుజరాత్‌, కోల్‌కత్తా వంటి అనేక చోట్ల దీనిని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక కొత్త అల్లుళ్లు ఈ పండుగలకు తమ అత్తారిళ్లకు రావడం సాధారణం. ఎంత స్టైలిష్‌స్టార్‌ అయినా గొప్పనటుడైనా తల్లిదండ్రులకు కుమారుడు, తమ్ముళ్లకు అన్నయ్య, భార్యకి భర్త, అత్తవారింటి వారికి అల్లుడే కదా…! అయితే పెళ్లయిన కొత్తల్లో ఏ అల్లుడైనా అత్తారింటికి వెళ్తాడు. కానీ అల్లుఅర్జున్‌ మాత్రం తన అత్తగారింటికి ప్రతి ఏడాది వెళ్లి పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటాడు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి స్నేహారెడ్డి అమ్మమ్మ, అంటే తన అత్త అమ్మవారింటికి వెళ్లి పండుగను జరుపుకున్నాడు. 

నల్గొండ జిల్లాలోని పెద్దపుర మండలం, చింతపల్లిలో ఉంటున్న స్నేహ వాళ్ల అమ్మమ్మ ఊరు వెళ్లాడు. ఇక బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఆ ఊరు వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు ఆ ఇంటి ముందు సందడి చేశారు. జీన్స్‌ప్యాంట్‌లో లాల్చీ వెసుకొని వస్తోన్న బన్నీ పిక్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. మొత్తానికి బన్నీ కూడా తానో ఫ్యామిలీ మ్యాన్‌ని అని నిరూపించుకున్నాడు.