హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘అరవింద సమేత’ సెకండాఫ్ చంపేశాడంట ఒబా..!

‘అరవింద సమేత’ సెకండాఫ్ చంపేశాడంట ఒబా..!

Category : Uncategorized

అరవింద సమేత – వీర రాఘవ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల టైమే మిగిలుంది. దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి.. ముందుగా బరిలోకి దిగుతున్న భారీ బడ్జెట్ మూవీ ఈ ‘అరవింద సమేత’. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రామ్ చరణ్ రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ అంతే అంచనాలతో అంతే భారీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం. గత నాలుగైదు నెలలనుండి భారీ బడ్జెట్ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం కూడా ఇదే.

ఇక భారీ అంచనాలతో పాటుగా నిన్న జారీ చేసిన సెన్సార్ టాక్ తో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అరవింద సమేత ని వీక్షించిన సెన్సార్ సభ్యులు అరవింద సమేతకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక అరవింద సమేత వీర రాఘవ సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని.. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని విశ్వసనీయ సమాచారం. అంటే ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ టాక్ పడడం ఖాయమనే మాట వినబడుతుంది. ఇక సినిమా రన్ టైం కూడా లాక్ చేశారు. ఈ సినిమాకి నిడివిని 161నిమిషాల 30సెకండ్లకు (2గంటల 41 నిమిషాల 30 సెకండ్లు) లాక్ చేశారట.

మరి పూజా హెగ్డే, ఇషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతి బాబులు చాలా కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో పాటుగా మాస్ అండ్ క్లాస్ లుక్ తోనే కాదు… మంచి డాన్స్ లతోను అలరించనున్నాడనేది అరవింద ప్రోమోస్ చూస్తే తెలుస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.