హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

అల్లు ‘రామాయణ’ మూవీలో నటించేది వీరే!

అల్లు ‘రామాయణ’ మూవీలో నటించేది వీరే!

Category : Uncategorized

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితేష్‌ తివారీ (దంగల్‌ ఫేం), రవి ఉద్యవర్‌ (మామ్‌ ఫేం) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? అని పాత్రదారులను వెతికే పనిలో దర్శకనిర్మాతలు బిజిబిజీగా ఉన్నారు. అయితే ఇందులో నటించేందుకు పలువుర్ని సంప్రదించగా నో చెప్పేశారని వార్తలు వినవచ్చాయి. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కాకుండా బాలీవుడ్ నటుల పేర్లు హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

రూ.1500 కోట్ల ఈ భారీ బడ్జెట్‌ మూవీలో.. శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నట్లు సమాచారం. రాముడి పాత్రలో నటించాలని హృతిక్‌ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాముడు సెట్ అయ్యాడు కదా అని సీత కోసం వెతుకుతుండగా.. స్టార్ హీరోయిన్లగా ఓ వెలుగు వెలిగిన.. ఇప్పుడు కూడా అదే క్రేజ్‌తో ఉన్న నయనతార లేదా అనుష్కను తీసుకుంటారని తెలుస్తోంది.

వీరిద్దరే ఎందుకంటే.. ఇప్పటికే వీళ్లు పెద్ద పెద్ద పాత్రల్లో నటించి మెప్పించి సక్సెస్ అయ్యారు. అందుకే ఇద్దరిలో ఎవర్ని సెలెక్ట్ చేసుకుందామా..? అని ఫైనల్ చేసే పనిలో దర్శక నిర్మాతలు బిజిబిజీగా ఉన్నారట. అయితే ఫైనల్‌గా ఎవరికి చిత్రబృందం రెడ్ సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.