హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ఆరోజు షారుఖ్‌‌ని అపార్థం చేసుకున్నా: నటి!

ఆరోజు షారుఖ్‌‌ని అపార్థం చేసుకున్నా: నటి!

Category : Uncategorized

నటిగా 25 ఏళ్ల కెరీర్‌, ‘దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే’, ‘కభి ఖుషీ కభీ గమ్‌’ వంటి సినిమాల్లో సత్తా చాటుకున్న నటి కాజోల్. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నేను నటించిన ‘హెలికాప్టర్‌ ఈలా’ చిత్రం అక్టోబర్‌ 12న విడుదల కానుంది. ఇక నేను సినిమాల ద్వారా ఎంతో నేర్చుకున్నాను. దర్శకుడు రాహుల్‌ అంకుల్‌ మంచి టీచర్‌ వంటి వ్యక్తి. ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ గౌతమ్‌ రాజాధ్యక్ష్య, మేకప్‌ ఆర్టిస్టు విక్కీలతో కూడా కలిసి పనిచేశాను. వారిద్దరు నాతో చాలా స్నేహంగా ఉండేవారు. ‘బాజీఘర్‌’ చిత్రం సమయంలో నాకు, షారుఖ్‌ఖాన్‌కి మధ్య జరిగిన సంభాషణ నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది. ఎలా నటించాలో ఇంకా నేర్చుకో అని షారుఖ్‌ నాతో అన్నారు. నేను అద్భుతంగానే నటిస్తున్నానని షారుఖ్‌కి సమాధానం ఇచ్చాను. నటిగా నువ్వు ఇంకా చాలా ఎదగాలని షారుఖ్‌ మరలా అన్నాడు. 

దాంతో షారుఖ్‌ కొన్ని సార్లు ఇష్టం వచ్చినట్లుగా, చెత్తగా, ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడుతాడని మనసులో అనుకున్నాను. కానీ ‘ఉధార్‌ కీ జిందగీ’ చిత్రం సమయంలో షారుఖ్‌ చెప్పిన మాటల్లోని నిజం నాకు అర్ధమైంది. అందులో భారీ పాత్రలని పోషించడం కోసం ఎంతో కష్టపడ్డాను. అప్పుడు షారుఖ్‌ మాటల్లోని నిజాయితీ తెలిసి వచ్చింది. నటిగా నేను నథింగ్‌ అని, బరువైన పాత్రలను పోషించాలంటే నటిగా ఇంకా ఎంతో ఎదగాలని నాకు అర్దమైంది..’’ అని కాజోల్‌ చెప్పుకొచ్చింది.