హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ఆసక్తికరంగా మారిన రాఖీ, తనుశ్రీ వ్యవహారం!

ఆసక్తికరంగా మారిన రాఖీ, తనుశ్రీ వ్యవహారం!

Category : Uncategorized

సమాజంలో మహిళల మీద వేధింపులే కాదు.. చిన్నారులు, మగాళ్లు, మహిళలపై మహిళలు, వృద్ద అత్తామామలపై కోడళ్లు, కోడళ్లపై అత్తల వేధింపులు.. తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో నానా హింసలు పెట్టే సంతానాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని విడివిడిగా మనం చూడలేం. ఇవ్వన్నీ ఒకటితో మరోటి ముడిపడి ఉంటాయి. ఇప్పటికే మగాళ్లపై కూడా ఆడాళ్ల వేధింపులు ఉన్నాయని భోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌తో పాటు అక్షయ్‌కుమార్‌తో పాటు పలువురు చెప్పారు. ఇక మగాళ్లపై కక్ష్యసాధింపు కోసం వేధింపుల ఆరోపణలు చేసే వారి గురించి విషయాలను బయటపెట్టేందుకు బెంగుళూర్‌కి చెందిన కొందరు పురుషులు ‘మెన్‌ టూ’ అనే ఉద్యమం మొదలుపెట్టారు. 

తాజాగా శృంగార నాయిక రాఖీసావంత్‌ ‘షీటూ’ అనే ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే తనుశ్రీ దత్తా తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పి షాకింగ్‌ ఇచ్చిన ఆమెపై న్యాయపరంగా పరువు నష్టం దావా వేయడానికి తనుశ్రీ సిద్దమైంది. ఇక తాజాగా రాఖీ సావంత్‌ మాట్లాడుతూ పలు సంచలన విషయాలను బయటపెట్టింది. పుష్కరకాలం కిందట తనుశ్రీదత్తా తనపై పలుమార్లు అత్యాచారం చేసిందని రాఖీ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయాన్ని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఒక అమ్మాయిని మరో అమ్మాయి రేప్‌ చేయడం ఏమిటని అనుకోవద్దు. ప్రస్తుతం అందరి దృష్టి ‘మీటూ’ ఉద్యమం పైనే ఉంది. కానీ ‘షీటూ’ ఉద్యమం కూడా మొదలుకావాల్సిన అవసరం ఉంది. నా జీవితంలో జరిగిన అసభ్యకర సంఘటన గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఈ విషయంలో నేను ఓ అమ్మాయిగా రేప్‌ అనే పదం వాడటం కరెక్టో కాదో కూడా నాకు తెలియడం లేదు. 

తనుశ్రీ చూడటానికి అమ్మాయే అయినా ఆమె బుద్దులని మగాళ్లవే. తనుశ్రీ 12 ఏళ్ల కిందట నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నన్ను డ్రగ్స్‌ తీసుకోమని బలవంతం చేసింది. అప్పట్లో పేరు బయట పెట్టడానికి నేను ఎంతో భయపడ్డాను. రేప్‌ చేస్తానని, చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి. తనుశ్రీపై నేను చేస్తోన్న ఆరోపణలకు సంబంధించి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. తనుశ్రీ వంటి లెస్బియన్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వార్ల పేర్లను మాత్రం నేను కావాలని బయటపెట్టబోను. తనుశ్రీ నా శరీరంలో ఎక్కడెక్కడా చేతులు వేసింది.. ఏమి చేసిందనే విషయాలను కోర్టులోనే చెబుతానని రాఖీసావంత్‌ తెలిపింది.