హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ఆ వీడియో చూసి సమంత షాకైంది..!

ఆ వీడియో చూసి సమంత షాకైంది..!

Category : Uncategorized

గత అక్టోబర్‌ నుంచి అక్కినేని ఫ్యామిలీలో శుభకార్యాలు, కెరీర్‌పరంగా విజయాలు వరుసగా తలుపుతడుతున్నాయి. నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కమర్షియల్‌గా బాగా మెప్పించింది. మరోవైపు నాగచైతన్యతో వివాహం జరిగిన తర్వాత కూడా సమంతకు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు.. సరికదా..! ఇంకా ఎంతో ఊపుతో ముందుకు దూసుకుని వెళ్తూ నటిగా తనసత్తా చాటే చిత్రాలు చేస్తోంది. తద్వారా వివాహం తర్వాత హీరోయిన్లకు క్రేజ్‌ ఉండదు అనే విమర్శలను ఆమె బ్రేక్‌ చేసింది. 

మరోవైపు నాగార్జున, అఖిల్‌లు కూడా వరుస చిత్రాలు చేస్తున్నారు. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం తర్వాత త్వరలో నాగచైతన్య.. చందు మొండేటి దర్శకత్వంలో కీరవాణి, మాధవన్‌, భూమిక వంటి వారితో పనిచేసిన ‘సవ్యసాచి’ విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో ఎడమచేయి మాట వినని, కుడిచేత్తో సమానంగా బలం కలిగిన ఓ వెరైటీ క్యారెక్టర్‌ని చైతు చేస్తున్నాడు. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విషయానికి వస్తే వరుస విజయాలతో ఉన్న నాగచైతన్య-సమంత దంపతులు పెళ్లికి ముందు పలు చిత్రాలలో కలిసి నటించారు. వివాహం జరిగిన తర్వాత మాత్రం వారు తొలిసారిగా వెండితెరపై కనిపించేందుకు రెడీ అయ్యారు. నేచురల్‌ స్టార్‌ నానితో ‘నిన్నుకోరి’ వంటి హిట్‌ చిత్రాన్ని తొలి చిత్రంతోనే అందించిన యంగ్‌టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శివనిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి ‘మజిలి’ అనే టైటిల్‌ని కూడా ఓకే చేశారు. 

ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్ననాగచైతన్య-సమంతల వీడియో ఒకటి తాజాగా లీక్‌ అయింది. దీనిని సామ్‌ వీరాభిమాని ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో చూశాక అద్భుతమైన భావన కలిగింది. మీరు నాగచైతన్యతో ఏదైనా టాప్‌ సీక్రెట్‌ మాట్లాడుతున్నారా.. సమంతా? ‘మజిలి’ చిత్రం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాం… అని అన్నాడు. ఈ వీడియోని చూసి షాకయిన సమంత అలాంటి ఎమోజీలనే కామెంట్‌గా పెట్టి.. తర్వాత దానిని తొలగించింది.