హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ఇలియానా ఎలా ఎంజాయ్ చేస్తుందో చూశారా?

ఇలియానా ఎలా ఎంజాయ్ చేస్తుందో చూశారా?

Category : Uncategorized

బాలీవుడ్ మీద మోజుతో టాలీవుడ్ కి దూరమైన గోవా బ్యూటీ ఇలియానా మళ్ళీ చేసేది లేక బాలీవుడ్ లో అవకాశాలు రాక టాలీవుడ్ లోకి రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. లుక్స్ లో, బాడీ షేప్స్ లో బాగా తేడా వచ్చిన ఇలియానా అమర్ అక్బర్ ఆంటోని సినిమా హిట్ అయితే హీరోయిన్ గా కొనసాగొచ్చు లేదంటే… బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అవ్వొచ్చు అనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు సినిమాల్లో నటించేసి సినిమాల పబ్లిసిటీలకు దూరంగా ఉండేది. క్రేజుంది కదా నిర్మాతలు కూడా ఇలియానాని ఏమనలేని పరిస్థితి.

మరి అమర్ అక్బర్ ఆంటోని విషయంలో మాత్రం ఇలియానా కాస్త మారినట్లుగానే కనబడింది. ఎందుకంటే అమర్ అక్బర్ ఆంటోని ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుండి ఛానల్స్ కి, ప్రింట్ మీడియాకి, వెబ్ మీడియాకి అమర్ అక్బర్ ఆంటోని ఇంటర్వ్యూ లు ఇస్తూ హడావిడి చేసింది. మరి శ్రీను వైట్ల ఒప్పించాడో… నిర్మాతలే ప్రాధేయపడ్డారో కానీ ఇలియానా మాత్రం అమర్ అక్బర్ ఆంటోని కి పబ్లిసిటీ చెయ్యడానికి ఒప్పుకుంది. అయితే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని టాక్ తో తనకెటువంటి సంబంధం లేదనుకుందో ఏమో… ఈ గోవా సుందరి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫిజి కి చెక్కేసింది.

సినిమా ఫలితం ఎలా ఉంటుందో టాలీవుడ్ లో తన భవిష్యత్తు ఏమిటో అని లేకుండా.. ఇలా ఫిజిలో స్కూబా డైవింగ్ చేస్తూ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మరి ఎంతైనా ఇలియానా గట్స్ ని మెచ్చుకోవలసిందే. కానీ ఇప్పటికే ఇలియానా గ్రాఫ్ తెలుగులో పడిపోయిందనేది మాత్రం నిజం. ఇక రీసెంట్ గా ఒక ప్లాప్ హీరో ఇలియానాని తన సినిమాలో వద్దని రిజెక్ట్ చేసినట్లుగా కూడా వార్తలొచ్చిన విషయం విదితమే.