హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ఎన్టీఆర్ ఏది చెబితే త్రివిక్రమ్ అదే చేశాడట..!!

ఎన్టీఆర్ ఏది చెబితే త్రివిక్రమ్ అదే చేశాడట..!!

Category : Uncategorized

డైరెక్టర్ అనేవాడు సినిమాకి కెప్టెన్ అఫ్ ది షిప్. ఇది ఎవరు ఏమి అనుకున్న ఒప్పుకుని తీరాల్సిందే. అన్ని పనులు అతని క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాలి ఎందుకంటే సినిమా ప్లాప్, హిట్ అతని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. కొంతమంది డైరెక్టర్స్ తన చుట్టుపక్కల వాళ్ళు చెప్పే సలహాలు తీసుకుంటారు. స్టార్ హోదాని అనుభవిస్తున్న కొంతమంది స్టార్ డైరెక్టర్స్ మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఎవరు ఎన్ని సలహాలు, సూచనలు ఇచ్చిన పట్టించుకోరు. అందులో త్రివిక్రమ్ కూడా ఒకరు.

ప్రొమోషన్స్ విషయంలో కూడా త్రివిక్రమ్ ఎవరి మాట వినరు. ‘అజ్ఞాత‌వాసి’ టైములో ఎవరి మాట వినకపోవడంతో అది డిజాస్టర్ అయిందని అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అరవింద సమేత విషయంలో ఎన్టీఆర్‌, నిర్మాత రాధాకృష్ణ నిర్ణ‌యాలూ ప‌నిచేస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా రిలీజ్ లాంటి విషయాల్లో మాటే చెల్లుబ‌డి అయ్యింద‌ని సమాచారం.

అంతేకాదు త్రివిక్రమ్ ఎన్నడూ లేని విధంగా అరవింద సమేత స్క్రిప్ట్ విషయంలో చాలామంది స‌ల‌హాలు తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ నో చెప్పిన ఏ సీన్స్ ఇందులో లేవని.. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ లకు నచ్చే సీన్స్ మాత్రమే ఇందులో ఉన్నాయని… ఎన్టీఆర్ ఈ స్క్రిప్ట్ విషయంలో చాలానే జోక్యం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇదంతా సినిమాకి ప్లస్ అవ్వాలని.. అంతే కానీ వేరే విధంగా కాదని.. చెబుతున్నారు ఎన్టీఆర్ దగ్గర ఫ్రెండ్స్. అక్టోబర్ 11 న వరల్డ్ వైడ్ గా ఈసినిమా రిలీజ్ అవుతుంది.