హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘కర్త కర్మ క్రియ’ను చాలా బాగా తీశాడంట!

‘కర్త కర్మ క్రియ’ను చాలా బాగా తీశాడంట!

Category : Uncategorized

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కర్త కర్మ క్రియ’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాల కంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. వినాయకరావుగారి వల్ల ఈ సినిమా తెరమీదకు వచ్చింది. ఆయనే ఈ సినిమాకి కర్త. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసేలా ఉంటుంది. ట్రైలర్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో సినిమా అంతకుమించి ఉంటుంది. కథ చెప్పిన దాని కంటే ది బెస్ట్‌గా ఈ సినిమాను బాధ్యతగా తీశారు. నవంబర్ 8 న చిత్రాన్ని విడుదల చేస్తాము‌. మా సూపర్ హిట్ చిత్రం ‘బిచ్చగాడు’ తరహాలో నాగు గవర రూపొందించిన ‘కర్త కర్మ క్రియ’ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము..’’ అన్నారు.

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. ‘‘యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. మనం రోజూ చూసే, వినే కాంటెంపరరీ క్రైమ్‌కు సంబంధించిన ఎలిమెంట్‌తో ఈ ‘కర్త కర్మ క్రియ’ను రూపొందిస్తున్నాము. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ సినిమాకు సెట్ కావటంతో పాటు, నిర్మాతల సపోర్ట్ మా సినిమాకు ప్రధాన బలం. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చేశాము. హీరోహీరోయిన్‌లు కొత్త వారైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్‌గా అంతే ఉత్తమంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీశాము. మా టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందనే నమ్మకముంది..’’ అన్నారు.