హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

కార్తీ ‘దేవ్’ లుక్‌లో భలే ఉన్నాడు

కార్తీ ‘దేవ్’ లుక్‌లో భలే ఉన్నాడు

Category : Uncategorized

కార్తీ నటిస్తున్న ‘దేవ్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..!!

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేయగా.. ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.. చేతిలో హెల్మెట్ తో, వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ ,రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.  ప్రకాష్ రాజ్,  రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, ముంబై, హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, నిక్కీ గల్రాని, కార్తీక్ ముత్తురామన్, ఆర్.జె.విగ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు