హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

కుక్కతో చేస్తే.. 100 కోట్లు ఇస్తా అన్నాడు: నటి

కుక్కతో చేస్తే.. 100 కోట్లు ఇస్తా అన్నాడు: నటి

Category : Uncategorized

బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ఖాన్‌ అసలు రూపం తాజాగా మీటూ ఉద్యమం ద్వారా బయటకు వస్తోంది. ఇప్పటికే పలువురి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ‘హౌస్‌ఫుల్‌ 4’ మూవీ నుంచి కూడా తప్పుకోవాల్సివచ్చింది. ఈయనపై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంకా బోస్‌, మందనా కరిమి, రేచల్‌ వైట్‌ వంటి పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. తాజాగా మరోనటి ఆయనపై ఇదే తరహా ఆరోపణలు చేసింది. నటి ఆహానా కుమ్రా.. సాజిద్‌ ఆగడాలను కళ్లకు కట్టినట్లు వివరించింది. 

ఆమె మాట్లాడుతూ, సాజిద్‌ వ్యవహారం నాకు తెలిసినప్పటికీ గత ఏడాది నేను ఆయనను ఆయన నివాసంలో కలిశాను. లైట్లు లేని గదిలోకి మొదట నన్ను తీసుకెళ్లారు. అక్కడ కాకుండా వెలుగు వచ్చే బయట కూర్చుందామని ఆయనను నేను కోరాను. దానికి ఆయన బయట తన తల్లి ఉందని, ఆమెకి అసౌకర్యం కలిగించడం తనకి ఇష్టం లేదని చెప్పాడు. దాంతో మౌనంగా ఉన్నాను. సాజిద్ నాతో సరిగా ప్రవర్తించాలనే ఆలోచనతో నా తల్లి పోలీస్‌ అధికారిణి అని ఆయనకు చెప్పాను. కానీ ఆయన ప్రవర్తన, మాటలు ఆగలేదు. అలా చెప్పినా కూడా జుగుప్స కలిగించే విధంగా ఆయన సంభాషించడం మొదలుపెట్టాడు. 

నేను 100కోట్లు ఇస్తే కుక్కతో సెక్స్‌కి పాల్పడతారా? అని అడుగుతూ తానేదో గొప్ప జోక్స్‌ వేస్తున్నట్లుగా భావించి, ఆ జుగుప్సాకరమైన జోక్స్‌కి నేను నవ్వాలని ఆయన ఆశిస్తున్నట్లు గ్రహించాను… అని ఆహానా కుమ్రా.. సాజిద్‌ఖాన్‌పై ఆరోపణలు చేసింది. మరి ఇంత మంది ఆయననే టార్గెట్‌ చేస్తున్నారంటే ఆయన ఖచ్చితంగా ఇలాంటి వాడే అయి ఉంటాడనే అనుమానం అందరిలోనూ కలుగుతోందనే చెప్పాలి.