హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘కెఎస్ 100’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘కెఎస్ 100’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Category : Uncategorized

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కెఎస్ 100’..  చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగా సినిమా పై మరిన్ని అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్యశ్రీ సాహిత్యం అందించారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ దక్కించుకోగా జూలై 5 న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. 

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జూలై 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. చాలామంది ఈ సినిమా కోసం ఎదురుచూశారు. నా సోషల్ మీడియాలో ఎప్పుడు రిలీజ్ అని అడిగారు. సినిమా కోసం వెయిట్ అందరికి చాలా థాంక్స్. తప్పకుండా అందరు ఈ సినిమాను ఆదరించండి.  అన్నారు. 

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘కెఎస్ 100’ చిత్రం జూలై 5 న రాబోతుంది. చిత్రం రిలీజ్ లేట్ అయినా ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నా. ప్యూర్ ఫ్యామిలీ సినిమా. ప్రతి సీన్ లో ఒక మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కరు మనమే గొప్ప అనే ఫీలింగ్ ని తగ్గిస్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది. సాంగ్స్, ట్రైలర్ ద్వారా మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ఈ సినిమా మరింత పెంచుతుంది. అన్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కెఎస్ 100’ చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 5 న దాదాపు 500 థియేటర్స్ లో  రిలీజ్ కాబోతుంది. ఒక మంచి సినిమా తీస్తే ఎలాంటి అవుట్ ఫుట్ ఉంటుందో అలాంటి సినిమా చేసాం. డైరెక్టర్ షేర్ మంచి సినిమా చేశారు. మంచి మెసేజ్ ఉంది. మేకింగ్ కి ఎంత కష్టపడ్డాడో సినిమా రిలీజ్ కి అంతే కష్టపడ్డాడు.  తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు. 

నటీనటులు : అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు

సాంకేతిక నిపుణులు : 

మాటలు- కథ- కధనం -దర్శకత్వం: షేర్

నిర్మాత : వెంకట్ రెడ్డి

కెమెరా: వంశీ

మ్యూజిక్: నవనీత్ చారి

ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున

సాహిత్యం: భాష్య శ్రీ 

కొరియోగ్రఫీ: జొజొ

యాక్షన్: మాలేష్

నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి

అసొషియెట్ డైరెక్టర్: రవితేజ

ఆర్ట్: సుదర్శన్

పి.ఆర్.ఓ : సాయి సతీష్