హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

కొత్త కొత్తగా శ్రీముఖి.. సక్సెస్ అవుతుందో లేదో!?

కొత్త కొత్తగా శ్రీముఖి.. సక్సెస్ అవుతుందో లేదో!?

Category : Uncategorized

హాట్ యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్నపాటి యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు ఎక్కడిగో ఎదిగిపోయి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అటు పటాస్‌తో పాటు పలు షోలకు యాంకర్‌గాన్.. అప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో సైతం మెరుస్తూ వస్తోంది. అయితే కొడితే కొండనే కొట్టాలి ఇవన్నీ ఎందుకు..? అనుకుందేమో కానీ ఏకంగా హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలని తహతహలాడుతోంది.

శ్రీముఖి చాలా బొద్దుగా ఉంటుందన్న ఆమె ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తునే ట్రోల్స్ చేస్తుంటారు. దీంతో అటు ఫ్యాన్స్ దాడి తట్టుకోలేక.. ఇటు సినిమాల్లోనూ రాణించాలని బొద్దుగా ఉన్న ఈ భామ ముద్దుగా.. స్లిమ్‌గా కావాలని డిసైడ్ అయ్యిందట. అంటే ఇదివరకున్న శ్రీముఖిలా కాకుండా ఇప్పుడు కొత్త కొత్తగా కానుందన్న మాట. అంతేకాదు.. ఇప్పటికే శ్రీముఖి హీరోయిన్‌గా ఓ కథ సైతం సిద్ధమైందట. ఈ సినిమాలో శ్రీముఖినే ప్రధాన పాత్రలో నటిస్తోందట.

ఆ చిత్రమేంటన్న విషయం తెలియరాలేదు కానీ.. డైరెక్టర్ మాత్రం గౌతమ్ ఇ.వి.ఎస్ అని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని టాక్. ఇలా శ్రీముఖి హీరోయిన్‌గా నటిస్తోందని తెలుసుకున్న యూత్, నెటిజన్లు, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆల్ ది బెస్ట్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకూ యాంకర్‌గా అంచెలంచెలుగా ఎదిగిన శ్రీముఖి.. హీరోయిన్‌గా ఏ మాత్రం సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.