హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

కౌశల్.. ఎంత ఎదిగిపోయావయ్యా…?

కౌశల్.. ఎంత ఎదిగిపోయావయ్యా…?

Category : Uncategorized

బిగ్‌బాస్‌ సీజన్‌2 విజేత కౌశల్‌ జోరు మామూలుగా కూడా లేదు. ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పుడు ఎవ్వరూ ఆయనకు ఇంత క్రేజ్‌ వస్తుందని ఊహించలేదు. మామూలుగా సినిమాలలో చిన్నచిన్న పాత్రలు, బుల్లితెర నటునిగానే ఆయన పరిచయం. దాంతో ఇలాంటి వారిని పిలిస్తే షో ఏమి రక్తికడుతుంది? అని భావించిన వారు కూడా ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు కౌశల్‌కి లభిస్తున్న క్రేజ్‌, ఫాలోయింగ్‌లని చూస్తే ‘ఎంత ఎదిగి పోయావయ్యా’ అని అనిపించడం మామూలే. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఆయన దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయనను ప్రతి మీడియా సంస్థ ఆహ్వానించి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. 

ఇక పలు సినీ అవకాశాలు, హీరోగా కూడా బిజీ అవుతున్నాడు. ఏకంగా కౌశల్‌ ఆర్మీ ఆయన వెన్నంటే ఉండటం ఆశ్చర్యకరం. ఇక విషయానికి వస్తే త్వరలో ఈయన గిన్నిస్‌బుక్‌లోకి కూడా ఎక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ, నేను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి విజేతగా నిలిచి బయటకు వచ్చిన మూడో రోజున నాకు ప్రధానమంత్రి మోదీ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పుడు నేను షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆ కాల్‌ని మా నాన్నగారు రిసీవ్‌ చేసుకున్నారు. వారు మమ్మల్ని అభినందిస్తే మా ఫాదర్‌ వారికి థ్యాంక్స్‌ చెప్పాడు.. అని చెప్పుకొచ్చాడు. 

ఇక మీకు డాక్టరేట్‌ వస్తోన్న వార్తల్లో నిజం ఎంత అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ డాక్టరేట్‌ ఎందుకిస్తున్నారో నేను చెప్పడం కన్నా.. ఆ డాక్టరేట్‌ని నాకు ఇస్తున్న వారు ఎందుకు ఇస్తున్నారో చెబితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.