హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

కౌశల్ మళ్లీ మాయ చేస్తున్నాడు..!

కౌశల్ మళ్లీ మాయ చేస్తున్నాడు..!

Category : Uncategorized

తన మాటలతో మాయ చేసి..నేను ఒంటరి అనే ఫీలింగ్ తెచ్చి కౌశల్ ఆర్మీ పేరుతో బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడు కౌశల్. సినిమాలో అవకాశాలు కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కౌశల్. రీసెంట్ గా అతను ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో..బిగ్ బాస్ టైటిల్ గెలిచాక తనకో యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వాలని సమాచారం ఇచ్చిందని..వాటికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెబుతున్నాడు.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ…మరోసారి అటువంటి మాటలే మాట్లాడాడు కౌశల్. లేటెస్ట్ గా అతనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చిందని షూటింగ్ లో ఉండటం వల్ల నాన్న లిఫ్ట్ చేసి థాంక్స్ చెప్పారని కౌశల్ అనడం మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అంతటితో ఆగకుండా తనకు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందని త్వరలోనే ఆ వివరాలు కూడా తెలుపుతానని అనడం మరో వింత.

అయితే మీకు 40 కోట్ల ఓట్లు ఎలా వచ్చాయి అనే దాని గురించి యాంకర్ ప్రశ్నించినప్పుడు దాటవేత సమాధానం ఇచ్చి తప్పించుకోవడం కొసమెరుపు. అయితే ఆయన చెబుతున్నవన్నీ.. ఆధారాలతో చెప్పుకుంటే బాగుంటుందని సగటు ప్రేక్షకులు చెబుతున్న మాట.