హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

చరణ్ నీవూ నిర్మాతవేగా? ఇలా చేస్తే ఎలా?

చరణ్ నీవూ నిర్మాతవేగా? ఇలా చేస్తే ఎలా?

Category : Uncategorized

రామ్ చరణ్ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా..! రామ్ చరణ్ కేరీర్ లోనే రెండు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరో. మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ మళ్ళీ సుకుమార్ తో రంగస్థలంతో ఆ ఫీట్ సాధించాడు. అయితే రంగస్థలంతో హిట్ గ్రాఫ్ ని నిలుపుకోవాలంటే మళ్ళీ మాస్ సినిమా చెయ్యాలని… హీరోలను తన సినిమాల్తో బాగా ఎలివేట్ చేసే బోయపాటి తో సినిమా మొదలెట్టాడు రామ్ చరణ్. రంగస్థలం సినిమా షూటింగ్ లో ఉండగానే రామ్ చరణ్, బోయపాటికి కమిట్ అయ్యాడు. కానీ రామ్ చరణ్ కి ముందు నుండి బోయపాటి తో సినిమా మీద నమ్మకం లేకో మరేమిటో కానీ… బోయపాటి సినిమా షూటింగ్ లో మొదట్లో యాక్టీవ్ గా పాల్గొనలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ RC12 షూటింగ్ కి వచ్చాడు.

బోయపాటి అప్పట్లో రామ్ చరణ్ కోసమే చాలా వెయిట్  చేసాడు. రామ్ చరణ్ ఆచి తూచి బోయపాటి సినిమాలో అడుగుపెట్టాడు. ఇక తాజాగా రామ్ చరణ్.. బోయపాటి షూటింగ్ ని నిర్లక్ష్యం చేస్తూ తండ్రితో నిర్మిస్తున్న సై రా షూటింగ్ మీద ఫోకస్ పెట్టాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. రంగస్థలంతో వచ్చిన క్రేజ్ ని కాపాడుకోవాలి గాని రామ్ చరణ్ ఇలా చెయ్యడం ఏమిటో తెలియదు గాని… రంగస్థలం అప్పుడు నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మాత్రం బోయపాటిని చరణ్ ముప్పుతిప్పలు పెడుతున్నాడని టాక్ మాత్రం ఫిలింనగర్ ని ఒక ఊపు ఊపుతుంది.

రామ్ చరణ్ చెప్పిన టైం కి షూటింగ్ కి హాజరవకుండా…. సెట్ లో టీం మొత్తం రెడీ అయ్యాక ఈరోజు నేను రావ‌డం లేదు… అని చరణ్ స‌డ‌న్‌గా ఫోన్ చేసి చెబుతున్నాడ‌ని… చరణ్ రాకపోవడంతో… దానివ‌ల్ల షూటింగుకి పేక‌ప్ చెప్పాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయ‌ని విశ్వసనీయ సమాచారం. మరి అలా అనుకోకుండా షూటింగ్ కి పేకప్  చెబితే నిర్మాత‌పై ఆర్థికంగా భారం ప‌డుతుంది. మ‌ళ్లీ కాల్షీట్లు స‌ర్దుబాటు చేయాలంటే, ఆర్టిస్టులు దొరకాలంటే చాలా క‌ష్టం అవుతుంది. మరి ఈ విషయాలన్నీ నిర్మాతగా మారిన రామ్ చరణ్ కి తెలియక పోవు కదా. అన్ని తెలిసిన చరణ్ లాంటి హీరోలే ఇలా చేస్తే మిగతా హీరోలు ఎందుకు చెయ్యరు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.