హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

చిరు చిన్నల్లుడికి.. ప్రియావారియర్ షాక్!!

చిరు చిన్నల్లుడికి.. ప్రియావారియర్ షాక్!!

Category : Uncategorized

మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ ‘విజేత’ తర్వాత తన రెండో చిత్రానికి రెడీ అవుతున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఆయన ఓకే చెప్పాడు. మొదట ఇదే దర్శకునితో, ఇదే బేనర్‌లో సుధీర్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి. కానీ ఏవో కారణాల వల్ల సుధీర్‌బాబు ఈ చిత్రానికి నో చెప్పడం, దాంతో ఆ కథ కళ్యాణ్‌దేవ్‌ వద్దకు వెళ్లడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక సుధీర్‌బాబుని హీరోగా అనుకున్నప్పుడు నిర్మాతలు హీరోయిన్‌గా మెహ్రీన్‌ని ఎంపిక చేసుకుని పాతిక లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’, ‘రాజా దిగ్రేట్‌, మహానుభావుడు’ వంటి చిత్రాలతో హిట్‌ కొట్టిన మెహ్రీన్‌ ఆ తర్వాత సందీప్‌కిషన్‌ ‘కేరాఫ్‌ సూర్య’ , గోపీచంద్‌ ‘పంతం’లతో మరలా యధాస్థితికి వచ్చింది. 

దిల్‌రాజు నిర్మాణంలో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్‌ 2’ చిత్రంపై ఈమె బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇందులో ఆమె వరుణ్‌తేజ్‌కి జంటగా నటిస్తోంది. కానీ ఈమె ఇప్పుడు కళ్యాణ్‌దేవ్‌-పులి వాసు చిత్రంలో నటించనని, అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేసిందని సమాచారం. దాంతో ఆమె స్థానంలో ఏకంగా ఒకే ఒక్క కన్నుగీటుతో సోషల్‌మీడియా సంచలనంగా మారిపోయిన ‘ఒరు ఆధార్‌లవ్‌’ బ్యూటీ ప్రియా వారియర్‌ని సంప్రదించారట. ఆమె చేత హీరోయిన్‌ పాత్రను చేయిస్తే చిరు చిన్నల్లుడి వల్ల కాకపోయినా, ప్రియా వారియర్‌ వల్లనైనా చిత్రానికి మంచి క్రేజ్‌ వస్తుందనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం ప్రియా వారియర్‌ కోసం పలు భాషల నిర్మాతలు, దర్శకులు, హీరోలు క్యూ కడుతున్నారు. 

కాగా కళ్యాణ్‌దేవ్‌ సరసన నటించేందుకు ప్రియాని అడిగితే ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ని డిమాండ్‌ చేసేసరికి దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపించాయట. కేవలం స్టార్స్‌ చిత్రాలలోనే నటించాలనే ఉద్దేశ్యంతో ప్రియా ఉందని, కాబట్టి చిన్న హీరోలకు నో చెప్పకుండా ఆమె ఇలా పారితోషికం భారీగా చెప్పి తప్పించుకుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నట్లు ఇటీవల ప్రియా వారియర్‌ అఖిల్‌తో కలిసి ఓ యాడ్‌లో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.