హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

చైతూ బర్త్‌డే స్పెషల్: ఫస్ట్ లుక్ ఇదిగో!

చైతూ బర్త్‌డే స్పెషల్: ఫస్ట్ లుక్ ఇదిగో!

Category : Uncategorized

రియ‌ల్ లైఫ్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత.. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ క్రేజీ కాంబినేష‌న్‌ను త‌న క‌థ‌తో మ‌రింత క్రేజీగా మార్చేస్తున్నారు ద‌ర్శ‌కుడు శివనిర్వాణ. కొన్ని రోజులుగా వైజాగ్‌లో జ‌రుగుతున్న షెడ్యూల్ తాజాగా పూర్తయింది. న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. నవంబ‌ర్ 23న నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. షూటింగ్ స్టేటస్‌ను తెలిపింది. 
‘ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు వచ్చిన ఔట్‌పుట్‌తో చాలా హ్యాపీగా ఉన్నాం. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త‌ణికెళ్ళ భ‌ర‌ణి, రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు..’’ అని నిర్మాతలు తెలిపారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌లో సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.