హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

జాన్వీ, ఖుషి.. బంధం చాలా ధృడమైనది..!

జాన్వీ, ఖుషి.. బంధం చాలా ధృడమైనది..!

Category : Uncategorized

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల విషయం పక్కనపెడితే ఆమె ఇద్దరు కూతుర్లు మాత్రం దిక్కులేని వారయ్యారు. అయినా వారు వాటిని, తల్లి జ్ఞాపకాలను దాచుకుంటూనే అతి పిన్న వయసులోనే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక జాన్వికపూర్‌ ప్రతి విషయానికి తల్లి మీద ఆధారపడేదని శ్రీదేవి సైతం తరచుగా చెబుతూ ఉండేది. అదే సమయంలో చిన్నకూతురు ఖుషీ కపూర్‌ మాత్రం చిన్ననాటి నుంచి తండ్రి బోనీకపూర్‌కి గారాల పట్టి. ఇక తాజాగా ఖుషీ కపూర్‌ జన్మదినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాన్వీ చెల్లితో తానున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ చెల్లికి శుభాకాంక్షలు తెలిపింది. 

ఈ సందర్భంగా జాన్వి ట్వీట్‌ చేస్తూ, చిన్ననాటి నుంచి నీ నుంచి నేను ఎదుర్కొన్న బెదింపులకు ఉదాహరణ ఇది.అయినా నువ్వంటే నాకెంతోఇష్టం. ఎంత అంటే.. నువ్వు ఊహించలేనంతగా, హ్యాపీ బర్త్‌డే టు యూ.. అని ఖుషీకి విషెష్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ పోస్ట్‌ చేసిన వీడియో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. బుల్లి జాన్వి, ఖుషీలు టీవీ ముందు డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సో క్యూట్‌.. ఈ చిన్నారు లిద్దరు ఇద్దరు ఇద్దరే. ఇద్దరు ప్రస్తుతం కోట్లాది మంది గుండెల్లో స్థానం సాధించిన యువతులు. మీ బంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలి’ అని వారికి విషెష్‌ చెబుతున్నారు. తల్లి శ్రీదేవి మరణం తర్వాత ఖుషీకి ఇదే మొదటి బర్త్‌డే. దాంతో ‘మీ అమ్మానాన్న ఎక్కడ ఉన్నా మీ బంధం చూసి ఆనందపడతారు. మీరిద్దరు జీవితాంతం ఇలాగే కలసి మెలసి ఉండాలి’ అంటూ సమాధానం ఇస్తున్నారు. ఇక చెల్లెలు ఖుషీతో తనకు ఉన్న అనుబంధాన్ని పలుసార్లు జాన్వి మీడియాతో పంచుకుంది. 

‘ఇంటి బయట మాత్రమే హీరోయిన్‌ అనే స్టేటస్‌ ఉంటుంది. ఇంట్లో మాత్రం నేను సాదా సీదా అమ్మాయినే. స్టార్‌ అనే ఫీలింగ్‌ నాకు రాకుండా, నన్ను భూమి మీదనే ఉంచుతోంది నా చెల్లెలు ఖుషీ. ఖుషిని నా చెల్లెలు అనడం కంటే అక్క అనడం బాగుంటుందేమో..! నువ్వు చాలా కూల్‌ అనుకుంటావు గానీ అదేం కాదు.. అంటూ నన్ను ఆటపట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటుంది.నాతో అన్ని పనులు చేయించుకుంటుంది…’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా జాన్వీ ‘ధడక్‌’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాగా, ఖుషీ కూడా అతి త్వరలోనే హీరోయిన్‌ కానుందనేది బాలీవుడ్‌ టాక్‌.