హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

డేటింగ్ చేస్తున్నానని డైరెక్ట్‌గా చెప్పేసింది

డేటింగ్ చేస్తున్నానని డైరెక్ట్‌గా చెప్పేసింది

Category : Uncategorized

కింగ్ నాగార్జునతో ‘రక్షకుడు’ సినిమాలో నటించిన సుస్మితా సేన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకు గుర్తు ఉండదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ.. నిత్యం వార్తల్లోనే ఉంటుంది కదా!. అయితే 40 ఏళ్లు నిండినా ఈ భామ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అదేమంటే ఏవేవో కారణాలు చెబుతుంది. అయితే పెళ్లి చేసుకోకపోయినా.. ఇద్దరు పిల్లలకు తల్లిగా సేవలు చేస్తోంది. అవును.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని.. పెంచుకుంటుంది.

అయితే ఈ భామ గురించి ఈ మధ్య మరో కోణంలో వార్తలు వినిపిస్తున్నాయి. సుస్మితకు పెళ్లిపై గాలి మళ్లీందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని వార్తలు రావడం, అలాగే మోడల్ రోమన్ షాల్‌లో ఈ మధ్య ఎక్కువగా కనిపించడం వంటి విషయాలతో ఆమె గట్టిగానే దొరికేసింది. రోమన్ షాల్‌‌తో ఇటీవల తాజ్‌మహల్ దగ్గర దర్శనమివ్వడంతో.. డౌటే లేదు ఈ భామ కూడా పెళ్లికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్‌లో వార్తలు వచ్చేశాయి.

అయితే ఈ వార్తలు తన వరకు రావడంతో.. ఆమే స్వయంగా ఈ విషయంపై స్పందించింది. పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదు కానీ, రోమన్ షాల్‌తో డేటింగ్ చేస్తున్నది నిజమేనంటూ డైరెక్ట్‌గా చెప్పేసింది. ఆమె ఇలా క్లారిటీ ఇచ్చేసి.. తనపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది సుస్మితా సేన్.