హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్‌లో మరో భూతం?

డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్‌లో మరో భూతం?

Category : Uncategorized

ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమాలంటే ప్రత్యేకమైన గౌరవం ఏర్పడేలా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సినిమాలు వస్తున్న ఈ తరుణంలో.. ఏదో ఒక కారణం, ఎవరో ఒకరూ.. ఎప్పుడూ టాలీవుడ్ పరువు తీసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఇటీవల టాలీవుడ్‌ను అతలాకుతలం చేసిన కొన్ని అసాంఘిక శక్తుల నుంచి ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న తెలుగు చిత్ర పరిశ్రమను పూర్తిగా నాశనం చేసేలా మరో భూతం వెలుగులోకి రాబోతోంది. ఇది అలాంటిలాంటి భూతం కాదు. దీని ద్వారా ఎంతోమంది రోడ్డున పడే పరిస్థితి తథ్యం అనేలా కొందరు దర్శకనిర్మాతల ముసుగులో చేస్తున్న పనులు టాలీవుడ్‌ను మరోసారి వార్తల్లోని వస్తువుగా చేయబోతున్నాయి. ఇప్పటికే కొందరు ఇలాంటి పనులు చేసి కోట్లు కూడగట్టారు. ఇప్పుడు ఇక్కడ చెప్పే దర్శకనిర్మాత కూడా నమ్మకాన్ని అమ్మి.. సొంతలాభం కోసం కళామతల్లికి కీడు చేస్తున్నాడు.

టాలీవుడ్‌లో ఓ కామెడీ మూవీతో దర్శకుడిగా టైటిల్ కార్డు వేయించుకున్న సదరు స్ర్కీన్‌ప్లే రైటర్.. ఇప్పుడు అదే కామెడీ హీరోతో నిర్మాతగా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా మొదలై సుమారు 3 సంవత్సరాలు కావస్తున్నా.. ఇంకా చిత్రీకరణలోనే ఉందని చెబుతూ.. పేరున్న వారందరిని సినిమాలో భాగస్వామ్యం చేస్తానంటూ.. వారి దగ్గర భారీగా డబ్బులు గుంజుతున్నాడు. ఈ మహా మాయగాడి వలలో టాలీవుడ్‌లోని ఓ ‘మెగా’ ప్రొడ్యూసర్ కూడా పడటం విశేషం. ఆచితూచి చాలా జాగ్రత్తగా సినిమాలు చేసే ఈ మెగా ప్రొడ్యూసర్.. ఈ నిర్మాతకు సుమారు రూ. 75 లక్షల వరకు సమర్పించాడట. ఈయన దగ్గరే కాదు ఓ ఐదారుగురు ఎన్నారైల నుంచి కూడా సుమారు రూ. కోటికి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత అమౌంట్ కలెక్ట్ చేసిన ఈ నిర్మాత.. దానిని సినిమాకు ఖర్చు చేయకుండా.. తన పర్సనల్‌కు వాడుకుని.. సినిమాని మీనమేషాలు లెక్కపెట్టేలా చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎన్నారైలు తమ దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము ఇమ్మని అడిగితే.. చెక్ లివ్వడం.. అవి బౌన్స్‌లవ్వడంతో సదరు దర్శకనిర్మాతపై కేసు కూడా నడుస్తోందని సమాచారం. ఈయనకు డబ్బులిచ్చి మోసపోయిన ఎన్నారై‌లు ఇప్పుడు లబోదిబోమని రోడ్డున పడే పరిస్థితి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వారు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు సమాచారం.

ఇంకా ఈ మహానుభావుడు చేసిన పనులు తెలిస్తే.. నిజంగా టాలీవుడ్‌లో ఇంత జరుగుతుందా? అని ఆశ్చర్యపోకమానరు. ప్రస్తుతం కామెడీ హీరోతో చేస్తున్న సినిమా మీకే అంటూ యుఎస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా అధికమొత్తంలో సొమ్ము చేజిక్కించుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కామెడీ హీరోతో చేస్తున్న ఈ చిత్రానికి 2 కోట్లపైనే బడ్జెట్ అయిందని ఇంటర్వ్యూలలో సదరు నిర్మాత చెబుతుండటం విశేషం.

మరో విషయం ఏమిటంటే.. ఈయన దర్శకత్వం వహించిన.. అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రంలోని హీరోయిన్‌ దగ్గర నుంచి కూడా రూ. 20లక్షలు వసూలు చేశాడట. ఇంతవరకు అవి తిరిగి ఇవ్వకుండా ఆమెను కూడా మోసం చేశాడని తెలుస్తోంది. ఇంత చేసిన ఈ మోసగాడు మళ్లీ.. తనకు సొమ్ము ఇచ్చి మోసపోయిన వారిని బ్లేమ్ చేసేలా కథనాలు సృష్టించి వారిని బెదిరించే ప్రయత్నాలు చేస్తుండటం నిజంగా ఘోరం. ఇలాంటి మోసగాళ్ల వల్లే ఎన్నారైలు తెలుగు సినిమా అంటే భయపడి పోతున్నారట. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కాకుండానే దీనికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ అమ్మే ప్రయత్నంలో సదరు నిర్మాత ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరి ఇలాంటి మోసగాళ్లు ఇంకెందరో ఉన్నారు. ఇలాంటి వారి వల్లే  ఇండస్ట్రీ ‘కంపు కంపు’ అవుతోంది. మరి ఈ మాయగాళ్ల నుంచి కళామతల్లిని కాపాడేవారు ఎవరో? ముసుగులో ఉండి.. అందినంత దోచుకుంటున్న ఇలాంటి కఠినాత్ములను శిక్షించే రోజు ఎప్పుడొస్తుందో? పుట్టిన దేశం కోసం ఎంతో కొంత ఇలా పెట్టుబడి రూపంలో అయినా సాయం చేద్దాం అని భావించే ఎన్నారైలకు ఇప్పుడు న్యాయం ఎలా జరుగుతుందో..?. చూద్దాం.. ఇలాంటి నమ్మకద్రోహులను ఇండస్ట్రీ నుంచి ఎవరు తరిమికొడతారో..?