హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘దేవ్’ విడుదల తేదీ ప్రకటించారు

‘దేవ్’ విడుదల తేదీ ప్రకటించారు

Category : Uncategorized

జ‌న‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్రవ‌రి 14న సినిమా విడుద‌ల‌.. 
కార్తి హీరోగా న‌టిస్తున్న దేవ్ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్రవ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఈ సంద‌ర్భంగా చిత్ర ఆడియో విడుద‌ల తేదీని కూడా క‌న్ఫర్మ్ చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో విడుద‌ల కానుంది. హ‌రీష్ జ‌య‌రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. దేవ్ ఫ‌స్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను ర‌జ‌త్ ర‌విశంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఖాకీ లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత కార్తి స‌ర‌స‌న రెండోసారి ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, ర‌మ్యకృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. నిక్కీ గల్రానీ ‘దేవ్’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.