హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

నాకు ‘రాముడు-భీముడు’ ఇద్దరూ ఇష్టమే: త్రివిక్రమ్

నాకు ‘రాముడు-భీముడు’ ఇద్దరూ ఇష్టమే: త్రివిక్రమ్

Category : Uncategorized

తాజాగా ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన అంతరంగాన్ని కూడా ఆవిష్కరించాడు. ఆయన మాట్లాడుతూ సినిమా కలెక్షన్లు పట్టించుకోను అని చెబితే అది అబద్దం అవుతుంది. తెలుసుకుంటాను. కానీ అది ఆ క్షణం మాత్రమే. మరలా మామూలే. దీనిని స్థితప్రజ్ఞత అని చెప్పలేను. కానీ దేనిని నాతో ఎక్కువకాలం ఉంచుకోలేను. సినిమా వైఫల్యాలను చూసి నేర్చుకునేది అంటూ ఏమీ ఉండదు. పొరపాటు ఎక్కడ జరిగిందో మనకి అర్దమైపోతూనే ఉంటుంది. 

‘అజ్ఞాతవాసి’ సినిమా సమయంలో ఆ కథ తనది అని ఓ హాలీవుడ్‌ డైరెక్టర్‌ ట్వీట్లు చేశాడు అన్నారు. సినిమా తర్వా త వారికి నేనేమీ పైసా కూడా ఇవ్వలేదు. వారు గట్టిగా అడిగి ఉంటే బాధపడుతూ కొంత ఇచ్చేవాడిని. ఇక సినిమా ఫ్లాప్‌ అయిందని మా రెమ్యూనరేషన్స్‌ తిరిగి ఇచ్చేశాం. సినిమా బాగాలేదని, కాపీ అని పలు విమర్శలు వచ్చాయి. మనం వాటినీ తీసుకోవాల్సిందే. అంతకు ముందు మనకేమైనా కోపం,ఆవేశం, ఆవేదన వస్తే ఇంట్లో వారితోనో, స్నేహితులతోనో పంచుకునే వాళ్లం. కానీ నేడు ఫోన్లు చేతిలో ఉన్నాయి. ఏం అనిపించినా సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టి చెప్పేస్తున్నాం. అన్నదానిని మరలా వెనక్కు తీసుకోలేం. అది ఆ క్షణం మాత్రమే. 

ఆతర్వాత కొన్ని రోజులకు అరే.. ఇలా అన్నానేంటి? అనిపిస్తుంది. నాలోని దర్శకుడు ఇష్టమా? రచయిత ముఖ్యమా? అంటే చెప్పలేను. రెండింటిని విడదీసి చూడలేను. ‘రాముడు-భీముడు’ చిత్రంలో ఇద్దరు ఎన్టీఆర్‌ల లాగా. మాటల మాంత్రికుడు వంటి బిరుదులను మాత్రం పట్టించుకోను. అందుకే ఎవరైనా యాంకర్‌ నా గురించి పొగడ్తలు చెప్పేసమయంలో వారిని నన్ను పొడిగించుకోకుండా ఉండేందుకు వెంటనే వేదికపైకి వెళ్లిపోతాను.. అని చెప్పుకొచ్చాడు.