హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘నాన్‌-బాహుబలి’ రికార్డులు అవుటా..?

‘నాన్‌-బాహుబలి’ రికార్డులు అవుటా..?

Category : Uncategorized

‘బాహుబలి’ నుంచి టాలీవుడ్‌ సత్తా రోజు రోజుకు పెరిగిపోతోంది. తెలుగు సినిమా ఇంతింతై వటుడింతై…అన్నంతగా ఎదుగుతోంది. నేడు బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ తో పాటు అన్ని వుడ్‌లు తెలుగు చిత్రాలపై ఓ కన్నేస్తున్నాయి. ‘బాహుబలి’ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’, మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 150వ చిత్రం, దశాబ్దం తర్వాత చిరు రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీనెంబర్‌ 150’ నాన్‌-బాహుబలి రికార్డులను సాధించింది. ఆ వెంటనే రామ్‌చరణ్‌ తండ్రిని మించిన తనయునిగా నిరూపించుకుంటూ ‘రంగస్థలం’ చిత్రాలతో రికార్డులను తిరగరాసే పనిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా విడుదలైన ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ల ‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రం జోరు చూస్తూ ఉంటే ఈ చిత్రం మరోసారి నాన్‌బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. కేవలం తొలి వారాంతంలోనే ఈ చిత్రం ఏకంగా 100కోట్లు వసూలు చేసినట్లు అఫీషియల్‌గా చిత్రయూనిట్‌ పోస్టర్‌తో సహా తెలిపింది. 

ఇక ఇప్పటికే ఈ మూవీ 50కోట్ల షేర్‌ను దాటిందని అంటున్నారు. మరోవైపు అక్టోబర్‌ 18న దిల్‌రాజు-రామ్‌-త్రినాధరావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ఎంత బాగున్నా కూడా అది ‘అరవిందసమేత వీరరాఘవ’పై ప్రభావం చూపే అవకాశాలు తక్కువే. ‘రంగస్థలం’లాగే లాంగ్‌రన్‌లో కూడా ‘వీరరాఘవుడు’ పాగా వేయడం ఖాయమనే అంటున్నారు. ఎన్టీఆర్‌, పూజాహెగ్డే నటించిన ఈ చిత్రం దుమ్ము రేపడానికి మూలకారణం త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌, జగపతిబాబు, తమన్‌లకే దక్కుతుందనే ప్రశంసలు లభిస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’తో ఎన్నడు ఎదుర్కోని వివర్శలను ఎదుర్కొని త్రివిక్రమ్‌ సత్తా పైనే అనుమానం వ్యక్తం చేసిన వారికి ‘అరవింద సమేత వీరరాఘవ’ ద్వారా త్రివిక్రమ్‌ తనేంటో మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ఫ్లాట్‌గా సాగే కథను తీసుకుని ఆయన మలచిన తీరు, కథ, కథనం, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ని ఎంతో వాస్తవికంగా చూపేందుకు ఆయన చేసిన గ్రౌండ్‌ వర్క్‌ని అందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

రొటీన్‌గా వచ్చే కమర్షియల్‌ ఫార్మాట్‌ చిత్రాలు, ఆరు పాటలు, రెండు ఐటం నెంబర్స్‌, మూడు డ్యూయెట్లు వంటి వాటికి భిన్నంగా దీనిని ఆయన మలచిన తీరుకి ఎనలేని ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తానికి ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘నాన్‌-బాహుబలి’ రికార్డులను ఎన్ని రోజుల్లో కొల్లగొడుతుంది? లాంగ్‌ రన్‌లో ఈ మూవీ ఎంత కాలం ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతూ స్టడీ కలెక్షన్లు సాధిస్తుంది? ఏ స్థాయి కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుని క్లోజింగ్‌ని ఎలా ముగిస్తుంది? అనేవి నేడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రం మరోసారి దేశయావత్తు సినీ ప్రముఖులను తన వైపుకు తిప్పుకుందనే చెప్పాలి.