హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

పడి పడి లేచె మనసు వెనుక మంచి స్టోరీ!

పడి పడి లేచె మనసు వెనుక మంచి స్టోరీ!

Category : Uncategorized

హను రాఘవపూడి నితిన్ హీరోగా అర్జున్ విలన్ గా ‘లై’ సినిమాని తెరకెక్కించగా… ఆ సినిమా మరీ టూ ఇంటిలిజెంట్ గా ఉండడంతో ఎవ్వరికి ఒక పట్టాన అర్ధంకాక ప్రేక్షకులంతా కలిసి డిజాస్టర్ చేశారు. అయితే ఆ సినిమా తర్వాత చాన్నాళ్ళకి హను రాఘవపూడి ‘మహానుభావుడు’ హిట్ తో ఉన్న శర్వానంద్ తో కలిసి ‘పడి పడి లేచె మనసు’ అంటూ ఒక ప్రేమ కథను మొదలు పెట్టడం… తాజాగా ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడం జరిగాయి. మధ్యలో శర్వానంద్ మీద సాయిపల్లవి మీద రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినప్పటికీ.. అనుకున్న టైంకే దర్శకుడు హను సినిమాని పూర్తి చేశాడు.

ఇక పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చెయ్యడం మిగిలుంది. ఇక పడి పడి లేచె మనసు సినిమా డిసెంబర్ 21 న విడుదల డేట్ ప్రకటించారు మేకర్స్. అప్పటికల్లా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ ని పక్కాగా పూర్తి చేసి సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ పడి పడి లేచె మనసు సినిమాలో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్ సాయిపల్లవి డాక్టర్ గా నటించింది. ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా ఒక కాలనీలో సాగే ప్రేమకథ కావొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రేమకథ వెనుక ఒక బలమైన నేపథ్యం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 

ఇక ఆ కథనం ప్రకారం పడి పడి లేచె మనసు కథ మొత్తం ఆ మధ్య నేపాల్ లో భారీ భూకంపం సంభవించి… వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వేలమంది గాయాలపాలయ్యారు. ఈ భూకంపం నేపథ్యంలోనే శర్వా – సాయి పల్లవుల ఈ ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకున్నట్టుగా తెలుస్తోంది. మరి వినటానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ సినిమా కథని హను రాఘవపూడి తనదైన స్టయిల్లో ఎలా తెరకెక్కించాడో అనేది డిసెంబర్ 21 వరకు ఆగితే తేలిపోతుంది.