హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

పార్టీలో మహేష్, ఎన్టీఆర్.. చరణే మిస్సయ్యాడు

పార్టీలో మహేష్, ఎన్టీఆర్.. చరణే మిస్సయ్యాడు

Category : Uncategorized

ఈమధ్యన స్టార్ హీరోల ఫ్యామిలీస్ మధ్యన ఎంతగా తత్సంబందాలు వెల్లి విరుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ తన భార్య ఉపాసనలు, ఎన్టీఆర్ ఫ్యామిలీ తో, మహేష్ ఫ్యామిలీతో ఎంతగా క్లోజ్ అయ్యాడో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. రామ్ చరణ్ – ఎన్టీఆర్ – మహేష్ లు మంచి స్నేహితులు. ఒకరి పార్టీలకు మరొకరు వెళ్లడం అనేది పరిపాటిగా మారింది. ఇక మహేష్ మహర్షితో బిజీగా ఉంటే… రామ్ చరణ్ RRR లో గాయమై రెస్ట్ లో ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా RRR షూట్ కి గ్యాపిచ్చాడు.

తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ కలిసి దర్శకుడు వంశి పైడిపల్లి భార్య మాలిని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఎలాగూ మహేష్ మహర్షి డైరెక్టర్ వంశీనే కావడం, ఎన్టీఆర్ కి బృందంతో వంశీతో అనుబంధం ఏర్పడడంతో.. ఎన్టీఆర్ కూడా భార్య లక్ష్మి ప్రణతితో కలిసి వంశీ పార్టీకి హాజరయ్యాడు. ఇక మహేష్ భార్య నమ్రత, సితార పాపతో కలిసి వంశీ భార్య మాలిని పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యాడు. మరి ఆ బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతి, మహేష్ – నమ్రత, వంశీ పైడిపల్లి – మాలిని, సితార, వంశీ కూతురు అందరూ ఎంతగా ఎంజాయ్ చేశారో పైన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. 

అయితే ఈ పార్టీలో రామ్ చరణ్ మిస్ అయ్యాడు. చరణ్ ప్రస్తుతం రెస్ట్ లో ఉండడమే కాదు.. బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేనకి సపోర్ట్ చేసున్నాడు. ఇక వంశీ పైడిపల్లి భార్య పుట్టినరోజు వేడుకలకి చరణ్ ఆయన భార్య ఉపాసన రాలేకపోయారు. చరణ్ తోనూ వంశీ పైడిపల్లి ఎవడు సినిమా చేసిన సంగతి తెలిసిందే.