హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

పోస్ట‌ర్ మాత్ర‌మే ఉల్టా అయిందా లేక‌..!

పోస్ట‌ర్ మాత్ర‌మే ఉల్టా అయిందా లేక‌..!

Category : Uncategorized

రామ్, పూరి జ‌గ‌న్నాథ్‌ల తొలి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూవీ `ఇస్మార్ట్‌ శంక‌ర్‌`. పూరీ క‌నెక్ట్స్‌, పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌ల‌పై పూరిజ‌గ‌న్నాథ్‌, ఛార్మింగ్ డాల్ ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి త‌న పంథాకు భిన్నంగా హార‌ర్ జోన‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమాను చేయ‌బోతున్నాడు. ప‌క్కా హైద‌రాబాదీ క‌థ‌తో అదే లాంగ్వేజ్‌తో ఈ సినిమాను ముంచెయ్య‌బోతున్నాడు పూరి. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను. ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసింది.

`డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ` అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రెండు లుక్‌లు బ‌య‌టికి వ‌దిలారు. అందులో ఒక‌టి స్ట్రెయిట్ లుక్‌తో వుంటే మ‌రొక‌టి కావాల‌నే త‌ల‌క్రిందులుగా ఉల్టాచేసి విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ చూసిన వాళ్లంతా  రామ్ లుక్ చాలా స్టైలిష్‌గానే వుంది అంటూనే పోస్ట‌ర్ మాత్ర‌మే ఉల్టా అయిందా లేక సినిమాలోని కంటెంట్ కూడా పోస్ట‌ర్ త‌ర‌హాలోనే  ఉల్టాప‌ల్టా కాబోతోందా? అని సెటైర్లు వేస్తున్నారు. అలా అయ్యే స‌మ‌స్యే లేద‌ని, ఈ సినిమాతో పూరి ఖ‌చ్చితంగా హిట్టుకొట్టాల‌నే క‌సితో వున్నాడ‌ని పూరి బ్యాచ్ స్ట్రాంగ్‌గా చెబుతోంది. 

రామ్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మెచ్యూర్డ్ క్యారెక్ట‌ర్ ఒక్క‌టీ చేయ‌లేదు. ఆ లోటును ఈ సినిమా తీర్చ‌నుంద‌ని తెలిసింది. ప‌క్కా తెలంగాణ పోర‌డిగా క‌నిపించ‌బోతున్న రామ్‌కు ఈ సినిమా హిట్ కావ‌డం ఎంత అవ‌స‌ర‌మో, ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు కూడా అంతే అవ‌స‌రం. ఆ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుంటూ ఈ సినిమాతో పూరి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌కు స్కెచ్ వేసిన‌ట్టుగా చెబుతున్నారు. మ‌రి పూరి స్కెచ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలంటే మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే.