హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ప్లేబోయ్‌ కాదు.. బంగారం: కౌశల్ భార్య

ప్లేబోయ్‌ కాదు.. బంగారం: కౌశల్ భార్య

Category : Uncategorized

చాలామంది సినిమా ఫీల్డ్‌ అంటే ఎంజాయ్‌ చేయడం కోసమేనని అనుకుంటారు. అందులో అపోహతప్ప వాస్తవం ఉండదు. ఎంజాయ్‌ చేయాలనుకునే వాడికి డబ్బుంటే చాలు. కాస్త అందచందాలు అదనం. అయితే ఇవేమీ లేని రోజుకి రెండొందలో మూడొందలో సంపాదించే వారు కూడా తమ స్థాయిల్లో ఎంజాయ్‌చేస్తూ ఉంటారు. చేతిలో బీడీ కట్ట, గంజాయి, నేల టిక్కెట్‌లో సినిమా, 50రూపాయలు తీసుకునే వేశ్య దగ్గరకైనా వెళ్తారు. మహాఅయితే ఖరీదెక్కువ కాకుండా గుడుంబా, చీప్‌లిక్కర్‌ వంటి వాటితో అన్ని అనుభవిస్తారు. 

ఇక విషయానికి వస్తే బిగ్‌బాస్‌ విజేత కౌశల్‌ ఇప్పుడు సంచలన వ్యక్తిగా మారాడు. కెరీర్‌లో బిజీ కావడంతో పాటు ఎక్కడికి వెళ్లినా జనాలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపధ్యంలో కౌశల్‌ తన శ్రీమతి నీలిమాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. బిగ్‌బాస్‌లో కొందరు తనని ప్లేబోయ్‌ జాబితాలో చేర్చడంపై ప్రతిస్పందించాడు. గేమ్‌లో భాగంగా ఓ అమ్మాయి చేతిని పట్టుకుంటేనే నన్ను ప్లేబోయ్‌ అంటున్నారు. హౌస్‌లో మిగతా వాళ్లు హగ్‌లిచ్చుకున్నారు. కిస్సులు పెట్టుకున్నారు. ఒకరి మీద ఒకరు ఒళ్లో కూర్చోవడాలు వంటివి చేశారు. మరి వాళ్లందరినీ ఏమనాలి? అయినా ఓ అమ్మాయి చేయి పట్టుకోవడం కోసం నేను బిగ్‌బాస్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఉన్నది మోడలింగ్‌ రంగంలో అనేది గుర్తుంచుకుంటే చాలు..అని బాగా సమాధానం ఇచ్చాడు.

అప్పుడు కౌశల్‌ గురించి ఆయన శ్రీమతి నీలిమా స్పందిస్తూ, పెళ్లికిముందేమో గానీ పెళ్లి తర్వాత మాత్రం ఆయన బంగారమే. పెళ్లికి ముందే తన గత జీవితం అంతా నాకు చెప్పాడు. ఆయన ప్లేబోయ్‌కాదు. మాతో గడపడానికే ఆయనకు సమయందొరకదు. అలాంటప్పుడు ఇక ఇతర వ్యాపకాలు ఏముంటాయి? అంటూ తన భర్తకి మద్దతు తెలిపింది. 

అయినా విజేతగా నిలిచిన వారిలోని పాజిటివ్ పాయింట్స్‌ని చూడకుండా, నిత్యం వారి గెలుపుని తక్కువ చేసేలా ఏదో ఒక ఇష్యూని పట్టుకుని మాట్లాడటం సరికాదు. అయినా హిందీ బిగ్‌బాస్‌లో ఏకంగా స్విమ్మింగ్‌పూల్స్‌లో శృంగారం చేస్తూ కెమెరాలకు చిక్కిన వారికంటే తెలుగు బిగ్‌బాస్‌ అందునా కౌశల్‌ ఎంతో మేలని చెప్పాలి…!