హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ఫస్ట్‌లుక్ చూస్తుంటే.. దుమ్మురేపేలానే ఉంది!

ఫస్ట్‌లుక్ చూస్తుంటే.. దుమ్మురేపేలానే ఉంది!

Category : Uncategorized

టాలీవుడ్‌లో నేటితరానికి మల్టీస్టారర్స్‌ చూసే బాగ్యం ఉండదేమో అని అందరు భావించారు. నిన్నటితరంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి వారితో ఎన్నో మల్టీస్టారర్స్‌ వచ్చాయి. కానీ చిరంజీవి, బాలకృష్ణల హయాం మొదలైన తర్వాత ఇవి తెరమరుగైపోయాయి. మహా అయితే ఎవరైనా స్టార్‌ ఒక చిన్న హీరో చిత్రంలో ఓ చిన్న పాత్ర చేస్తేనో, లేక పెద్దగా ఇమేజ్‌లేని హీరోలు కలసి నటిస్తేనో వాటినే మల్టీస్టారర్స్‌గా తృఫ్తిపడిపోయాం. కానీ మరలా ఇంతకాలానికి తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించనున్న అసలు సిసలు మల్టీస్టారర్‌ హిట్‌ అయితే ఈ ట్రెండ్‌కి మరింత ఊపు వస్తుంది. 

అయితే బాలీవుడ్‌లో మాత్రం ఎప్పుడు మల్టీస్టారర్స్‌కి కొదువ లేదు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో చిత్రాలు ఇలా వచ్చాయి. ఇక విషయానికి వస్తే ‘దంగల్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్’ తో నటునిగా, నిర్మాతగా కూడా అమీర్‌ఖాన్‌ దేశంలోనే కాదు.. ముఖ్యంగా చైనాపై దండయాత్ర చేసి ‘దంగల్‌’లో నటునిగా, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’తో నటునిగా, నిర్మాతగా కూడా భారతీయ సినీ గౌరవాన్ని ఎన్నో రెట్లు పెంచాడు. ప్రస్తుతం ఆయన బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో కలిసి ‘థగ్స్‌ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా ఓ పీరియాడికల్‌ మూవీ వంటిదే. దేశ స్వాతంత్య్రానికి పూర్వం దేశ సరిహద్దులో ఉన్న బందిపోటు దొంగల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటి పరిస్థితులను ప్రేక్షకులకు కళ్లకు కట్టి, నవరసాలను ప్రేక్షకులకు వడ్డించనుంది. 

ఇందులో అమీర్‌ఖాన్‌ ఓ మంచి మనసున్న బందిపోటు దొంగలా నటిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి చెందిన ఓ మోషన్‌పోస్టర్‌ని చిత్రంలోని పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేశారు. ఇది అద్భుతంగా ప్రేక్షకులను అలరిస్తోంది. దీనితో పాటు అమీర్‌ ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ని చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ కూడా వైరల్‌ అవుతోంది. ‘నా పేరు ఫిరంగీ మల్లాహ్‌. ఈ భూమిపై నాకంటే మంచి మనిషి ఎక్కడా కనిపించడు. నిజం నా మారు పేరు. నమ్మకం నా వృత్తి. దీదీ మీద ఒట్టు’ అంటూ ట్వీట్‌ చేస్తూ ప్రొమో విడుదల చేశాడు. అమితాబ్‌బచ్చన్‌, అమీర్‌ఖాన్‌, ఫాతిమా సనా షేక్‌, కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకుడు. 

ఆదిత్యాచోప్రా నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 8న విడుదల కానుంది. పీరియాడికల్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు చైనా ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మరోసారి స్వాతంత్య్రపూర్వానికి తీసుకుని పోతుందని అంటున్నారు. అందునా అమీర్‌, ఫాతిమా సనా షేక్‌ల సెంటిమెంట్‌ ఈ చిత్రానికి కూడా వర్కౌట్‌ అయితే అమీర్‌ తన రికార్డులను తానే తిరిగి రాసుకునే అవకాశం ఉందని ఘంటాపథంగా చెప్పవచ్చు.