హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’.. నిర్మాత ఎవరంటే?

బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’.. నిర్మాత ఎవరంటే?

Category : Uncategorized

‘ఓ బేబీ’…సమంత అక్కినేని నటించి నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూల్ కలెక్ట్ చేస్తుంది. ఇది ఒక కొరియన్ మూవీ నుండి ఆఫిషల్ రైట్స్ కొని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో ఇది హిట్ కావడంతో ఈసినిమాపై రానా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈమూవీ హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో రానా ఉన్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ఈమూవీని అలియా భట్ తో గానీ, కంగనాతో గాని ఈ రీమేక్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రానా ఉన్నట్టు సమాచారం.

హిందీలో తానే నిర్మించి నటించాలనుకుంటున్నాడు. తెలుగులో నాగ శౌర్య చేసిన పాత్రలో రానా నటించాలని భావిస్తున్నారు. అయితే డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే డైరెక్టర్ పై ఇతర నటీనటులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం వుంది.