హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

భైరవగీత రిలీజ్ డేట్ ఫిక్స్!

భైరవగీత రిలీజ్ డేట్ ఫిక్స్!

Category : Uncategorized

ధనంజయ మరియు ఇర్రా మోర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 22 న రిలీజ్ కానుంది.. తెలుగు, కన్నడ భాషలలో  తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమాకి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు.. ఒకే రోజున నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుండడం విశేషం..  

నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్

సాంకేతిక నిపుణులు : దర్శకుడు: సిద్ధార్థ తాతోలు, నిర్మాతలు: అభిషేక్ నామా మరియు భాస్కర్ రాశి,  సమర్పించు వారు: రామ్ గోపాల్ వర్మ, సంగీత దర్శకుడు : రవి శంకర్, కథ, స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ / రామ్ వంశీ కృష్ణ,  సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి m.f.a, ఎడిటర్: అన్వర్ అలీ