హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘మజిలీ’ హిట్టుతో చైతూ, సామ్ పెంచేశారు!

‘మజిలీ’ హిట్టుతో చైతూ, సామ్ పెంచేశారు!

Category : Uncategorized

మన హీరో హీరోయిన్లు రెమ్యూనరేషన్‌ విషయంలో ఎంతో కాలిక్యులేటెడ్‌గా ఉంటారు. వరుస అపజయాలు వచ్చినా తమ పాత పారితోషికాన్ని తగ్గించుకోరు. ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయినంత మాత్రన మా ఇమేజ్‌ ఏమైనా తగ్గుతుందా? ఒక్క హిట్‌ ఇస్తే మరలా లెక్కలు సరి అవుతాయి. కాబట్టి రెమ్యూనరేషన్‌ని తగ్గించడం అనేది అవమానకరమైన విషయంగా భావిస్తారు. ఈ విషయం మాస్‌ మహారాజా రవితేజ విషయంలో ఇప్పటికే నిరూపితం అయింది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న యంగ్‌స్టార్స్‌లో మొదటి కేటగరీలోకి మహేష్‌, జూనియర్‌, అల్లుఅర్జున్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ వంటి పలువురు వస్తారు. రెండో లీగ్‌లోకి విజయ్‌దేవరకొండ, నాని వంటి వారు వచ్చి చేరుతారు. మూడో కేటగరీలో ముందుండే హీరో మాత్రం అక్కినేని వారి పెద్దబ్బాయ్‌ నాగచైతన్య. 

గత రెండేళ్లుగా నాగచైతన్యకి సరైన హిట్‌ లేదు. తనకి భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ ఇస్తాడని చెప్పి, రమ్యకృష్ణని అత్తగా ఒప్పించి చేసిన మాస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శైలజారెడ్డి అల్లుడు, ఉగ్రవాదం బ్యాక్‌డ్రాప్‌లో చేసిన యుద్దం శరణం, విభిన్నమైన కాన్సెప్ట్‌ని టచ్‌ చేస్తూ చేసిన సవ్యసాచి వంటివి ఆయనకు నిరాశను మిగిల్చాయి. ఈ నేపధ్యంలో ఆయనను మజిలీ మేకర్స్‌ కాస్త పారితోషికం తగ్గించుకోమని కోరారని వార్తలు వచ్చాయి. 

కానీ చైతు ససేమిరా అన్నాడు. ఒక్క హిట్‌ వస్తే మరలా నా రేంజ్‌ ఏమిటో చూపిస్తానని ఆయన చెప్పిన మాట మజిలీతో రుజువైంది. పెళ్లికి ముందు ఏ మాయ చేశావే, మనం, ఆటోనగర్‌ సూర్య చిత్రాలలో కలిసి నటించిన నాగచైతన్య-సమంతలు పెళ్లి తర్వాత మరలా తెరపై మజిలీలోకనిపించారు. ఈ చిత్రంలో చైతు, సమంతల నటనకు, వారి ఎమోషన్స్‌కి మంచి మార్కులే పడ్డాయి. ప్రేక్షకులు కూడా బాగానే కనెక్ట్‌ కావడంతో ఈ చిత్రం 35కోట్ల దిశగా సాగుతోంది. దాంతో నాగచైతన్య ప్రస్తుతం తన రెమ్యూనరేషన్‌కి అదనంగా మరో కోటి రూపాయలు పెంచాడని సమాచారం. ఇక పెళ్లి తర్వాత కూడా రాజు గారి గది2, రంగస్థలం, అభిమన్యుడు, సూపర్‌డీలక్స్‌ ఇలా వరుస వైవిధ్యభరిత చిత్రాలతో దూసుకెళ్తున్న సమంత కూడా భారీగానే పారితోషికం పెంచిందని సమాచారం. ఇలా ఒకే సినిమా ఇద్దరికి రెమ్యూనరేషన్లు పెంచే అవకాశం కల్పించింది. అంటే ఇక రాబోయే రోజుల్లో అక్కినేని వారి ఇంటికి అదనపు ఆదాయం కోట్లలో వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. 

కాగా ప్రస్తుతం నాగచైతన్య తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో వెంకీమామ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన తన మొదటి చిత్రం జోష్‌ తదుపరి చాలా గ్యాప్‌ తీసుకుని దిల్‌రాజు బేనర్‌లో ఓ లవ్‌స్టోరీ చేయనున్నాడు. దీనికి కొత్త దర్శకుడు పరిచయం అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ అజయ్‌భూపతి దర్శకత్వంలో నాగచైతన్య మరో చిత్రం చేయనున్నాడు. మహాసముద్రం అనే టైటిల్‌ని అనుకుంటున్న ఇందులో ఇద్దరు హీరోలు నటిస్తారని, అందులో నాగ్‌ ఒకడని ప్రచారం సాగుతుండగా మజిలీ తర్వాత పెద్ద గ్యాప్‌ లేకుండా నాగచైతన్య, సమంతలు ఈ చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నారని సమాచారం.