హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

మనోజ్‌ ఎన్టీఆర్‌ కోసం సాహసం చేశాడట!

మనోజ్‌ ఎన్టీఆర్‌ కోసం సాహసం చేశాడట!

Category : Uncategorized

కెరీర్‌ పరంగా, క్రేజ్‌ పరంగా ఎన్టీఆర్‌కి మంచు మనోజ్‌కి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. అదేమి చిత్రమో ఎన్టీఆర్‌ ఏది చేసినా అభిమానించే ప్రేక్షకులు మంచు మనోజ్‌ ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ఆదరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు హీరోగా చేయడం మానుకోవాలని కూడా మంచు మనోజ్‌ ఓసారి సంచలన నిర్ణయం తీసుకున్నా, తర్వాత అది కూడా పబ్లిసిటీ స్టంట్‌ అనే తేలిపోయింది. ఇక సోషల్‌మీడియాలో అందరికంటే యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్‌ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తూ ఉంటాడు. ఈయన ఎన్టీఆర్‌కి చిన్ననాటి స్నేహితుడు కూడా. స్నేహం కోసం ఏమి చేయడానికైనా మంచు మనోజ్‌ వెనుకాడనని అంటూ ఉంటారు. 

ఇటీవల నందమూరి హరికృష్ణ హఠాన్మరణం సమయంలో కూడా మంచు మనోజ్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లకి అండగా నిలిచాడు. అంతేకాదు.. తారక్‌ కోసం మంచు మనోజ్‌ బాల్యంలోనే సాహసం చేశాడట. తారక్‌ని ఎవరో కొడితే మంచు మనోజ్‌ వెళ్లి అతని చేతిని విరగొట్టాడట. ఈ కథేంటో చెప్పాలని ఓ అభిమాని ట్విట్టర్‌ వేదిక సాక్షిగా మంచు మనోజ్‌ని కోరాడు. దానికి మంచుమనోజ్‌ సస్పెన్స్‌ని మెయిన్‌ టెయిన్‌ చేస్తూ, తారక్‌నే అడుగు.. నాకంటే అతనైతేనే బాగా చెబుతాడని రిప్లై ఇచ్చాడు. 

అయినా విషయం ఓపెన్‌ చేసింది మనోజ్‌ అయినప్పుడు మధ్యలో తారక్‌ని అడగమని చెప్పకుండా ఆ సస్పెన్స్‌ ఏదో తానే రివీల్‌ చేస్తే సరిపోయేది కదా..! అంటున్నారు కొందరు. మరి ఇందులో పబ్లిసిటీ స్టంట్‌ ఉందో లేక నిజమో మనోజ్‌ గానీ లేదా తారక్‌ గానీ ఓపెన్‌ అయ్యే దాకా తెలియదు మరి…!