హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘మీటూ’: అతడ్ని మాత్రం వదలనంటోంది..!

‘మీటూ’: అతడ్ని మాత్రం వదలనంటోంది..!

Category : Uncategorized

దక్షిణాది చిత్ర రంగంలో యాక్షన్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు అర్జున్‌. ఇటీవల మీటూ ఉద్యమంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కన్నడ నటి శృతిహరిహరన్‌ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘నిపుణన్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో అర్జున్‌ తనని లైంగికంగా వేధించాడని ఈమె బహిరంగంగా వెల్లడించింది. ఈ వార్తలు సంచలనం సృష్టించడంతోపాటు జెంటిల్‌మేన్‌గా గుర్తింపు పొందిన అర్జున్‌ ఇమేజ్‌ని డామేజ్‌ చేశాయి. అయితే శృతిహరిహరన్‌ ఆరోపణల్లో నిజం లేదని, ఇవన్నీ తనని కావాలని టార్గెట్‌ చేసినవని చెప్పి అర్జున్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడం, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై కోర్టుకి వెళ్లడం జరిగింది. అలాగే శృతి కూడా అర్జున్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కొందరు కన్నడ సినీ పెద్దలు ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అర్జున్‌తో రాజీకి శృతిహరిహరన్‌ ససేమిరా అంటోందిట. అందుకే శృతికేసులో తనని ఎక్కడ అరెస్ట్‌ చేస్తారో అనే భయంతోనే అర్జున్‌ కోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడని అంటున్నారు. అయినా అర్జున్‌ని వదిలేది లేదని శృతి స్పష్టం చేసింది. బెంగుళూరులోని మహిళా కమిషన్‌ ముందుకు వెళ్లి తనకి న్యాయం చేయాలని కోరుతూ ఆయనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కోరడంతో ఈ వివాదం ఇప్పటితో ముగిసే అవకాశాలు మృగ్యం అయిపోయాయి. 

తాజాగా శృతి తాను అర్జున్‌పై చేసిన ఆరోపణలన్నింటికీ తన వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. ఆయనపై ఫిర్యాదు చేసినందుకే అతను నా మీద కేసు వేశాడని వాదించింది. ఆ కేసును ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. అలాగే నేను చేసిన ఆరోపణలకు సంబంధించిన  ఆధారాలను కోర్టులోనే సమర్పిస్తాను. అదేవిధంగా అర్జున్‌ మద్దతుదారులు నన్ను బెదిరిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే అర్జున్.. తను చేసిన పనికి భయపడుతున్నట్లు అర్ధమవుతోంది. ఏది ఏమైనా అర్జున్‌ని వదిలే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. చూద్దాం.. చివరకు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో…?