హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

మురళీమోహన్ అసలు విషయం చెప్పేశాడు

మురళీమోహన్ అసలు విషయం చెప్పేశాడు

Category : Uncategorized

కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి హీరోలు తమదైన శైలిలో దూసుకుపోతున్న సమయంలో హీరో మురళీమోహన్‌ కూడా అంతటి పోటీలో కూడా తనదైన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హీరోగా, నిర్మాతగా ఎన్నో చిత్రాలు తీసిన ఆయన ఆ తర్వాత రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోకి వెళ్లాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ‘నేను చిన్నప్పటి నుంచి నాటకాలు బాగా వేసేవాడిని. వాటిని చూసిన చాలా మంది నువ్వు సినిమాలలో ట్రై చేయకూడదా? అనేవారు. 

దాంతో అదే సమయంలో అంతా కొత్తవారితో నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ‘జగమేమాయ’ సినిమా తీస్తున్నట్లు తెలిసి ఫొటోలు పంపించాను. అప్పటికే ఆ చిత్రంలో హీరోగా గిరిబాబును తీసుకున్నారు. ఆ తర్వాత పూర్ణచంద్రరావుగారు నా ఫొటో చూసి పిలిపించారు. హీరో పాత్రని నాచేత చేయించి గిరిబాబుకి విలన్‌పాత్రను ఇచ్చారు. అలా నా నటనాప్రస్థానం మొదలైంది. హీరో పాత్ర పోయినందుకు గిరిబాబు ఏమీ బాధపడలేదు. ఇప్పటికీ మేము మంచి స్నేహితులమే. హీరోగా వేషాలు మానేసిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాను. కానీ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. 

దాంతో నాకు తెలిసిన వేర్వేరు ఇద్దరు వ్యక్తులతో సినిమా బిజినెస్‌లోకి అడుగుపెట్టాను. అప్పుడు శోభన్‌బాబు గారు వ్యాపారాలలో భాగస్వామ్యం ఉండకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరి బిజినెస్‌లలోనూ భాగస్వాముల వల్ల నష్టాలు వచ్చాయి. సంపాదించిందే పోవడమే కాదు.. అప్పుల్లో కూరుకుపోయాను. అప్పుడు శోభన్‌బాబు గారు ‘ప్రపంచంలో జనాభా పెరుగుతుంది గానీ నివసించే భూమి పెరగదు. కాబట్టి భూముల మీద పెట్టుబడి పెట్టు’ అని సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహా వల్లనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు.