హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

మురుగదాస్ కి రజనీ హ్యాండ్ ఇచ్చాడా?

మురుగదాస్ కి రజనీ హ్యాండ్ ఇచ్చాడా?

Category : Uncategorized

“కబాలి, కాలా” లాంటి సినిమాలు దారుణంగా నిరాశపరిచినప్పటికే.. “2.0”తో రజనీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న సూపర్ స్టార్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో “పెట్ట” సినిమాలో నటిస్తూ యమ బిజీగా ఉన్నాడు. జనవరిలో విడుదలకానున్న ఈ చిత్రంపై రజనీకాంత్ మాత్రమే కాక ఆయన అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకొన్నారు. అందుకు కారణం దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ మీద ప్రేక్షకులకి ఉన్న ధీమా. దానికి తోడు నిన్న అనిరుధ్ విడుదల చేసిన “మరణ మాస్” అనే సింగిల్ కే‌యూ‌డి‌ఏ మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకొంది.

ఈ సినిమా అనంతరం సన్ పిక్చర్స్ బ్యానర్ లోనే మురుగదాస్ దర్శకత్వంలో మరో చిత్రం సైన్ చేశాడు రజనీ. ఆల్రెడీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వడమే కాక క్యాస్ట్ & క్రూ సెలక్షన్ కూడా జరిగిపోతోంది. కానీ.. రజనీ సడన్ గా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు మన మురుగదాస్ కి. రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించడమే కాక సొంత పార్టీని పేరు ప్రకటించి బలోపేతం చేసేందుకు రజనీ సన్నాహాలు మొదలెట్టాల్సి ఉండడంతో మురుగదాస్ సినిమాను వాయిదా వేయడమే లేక మొత్తానికి క్యాన్సిల్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

దాంతో.. “సర్కార్” కాస్త అటు ఇటు అయినా రజనీకాంత్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది అని తెగ సంబరపడిపోయిన మురుగదాస్ ఈ విషయం తెలిసేసరికి కంగారుపడుతున్నాడట. మరి మురుగ పరిస్థితి ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.