హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

యంగ్ హీరోతో డేటింగా అంటే క్లాస్ పీకింది!!

యంగ్ హీరోతో డేటింగా అంటే క్లాస్ పీకింది!!

Category : Uncategorized

కెవ్వుకేక అనే మాట వినబడితే చాలు గుర్తొచ్చే పేరు మలైకా అరోరా. గబ్బర్‌సింగ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు నర్తించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న పేరే. మంచి నటిగా కూడా గుర్తింపు ఉన్న మలైకా వివాదాల విషయంలోనూ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో సుమారు 20 సంవత్సరాల పాటు కాపురం చేసిన ఈ భామ ఇటీవల అతనికి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు కొత్తతోడును జత చేసుకుంది.

పెళ్లి అయితే చేసుకోలేదు కానీ, యంగ్ హీరో అర్జున్ కపూర్‌(బోనీకపూర్ తనయుడు) తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ అంతా ఒకటే వార్తలు. వీరిద్దరూ అస్తమానం ఎక్కడపడితే అక్కడ జంటగా కనిపించడంతో వీరి డేటింగ్ నిజమే అని అంతా నమ్మేస్తున్నారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీని గురించి ఇటీవల బాలీవుడ్ మీడియా గట్టిగానే మలైకాని ప్రశ్నించింది.

అయితే ఈ విషయంపై బాలీవుడ్ మీడియాకి మలైకా కూడా అర్ధం కానట్లుగానే సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నదంటే.. ‘‘నా వ్యక్తిగత విషయాల గురించి బయటికి చెప్పడానికి నా మనసు ఒప్పుకోదు. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా నా జీవితంలో ఏం జరుగుతుందనేది నాకంటే ముందు మీకే తెలిసిపోతుంది. మళ్లీ అడగడం ఎందుకు?. ప్రస్తుతం జీవితాన్ని హాయిగా అనుభవిస్తున్నా. నా జీవితం ఇప్పుడు ఎంతో ఆనందమయంగా నడుస్తుంది. దయచేసి ఈ సంతోషాన్ని దూరం చేయకండి..’’ అంటూ మలైకా ఇచ్చిన జవాబుతో మీడియాకి నోట మాట రాలేదంటే నిజం.