హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘యన్.టి.ఆర్’ కథానాయకుడు రిజల్ట్ వచ్చేసింది

‘యన్.టి.ఆర్’ కథానాయకుడు రిజల్ట్ వచ్చేసింది

Category : Uncategorized

బాలకృష్ణ ఓన్ బ్యానర్‌లో ఆయనే తన తండ్రి పాత్రని పోషిస్తూ.. దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో నందమూరి తారకరామారావుగారి జీవిత చరిత్రను కథానాయకుడు రూపంలో చాలా తక్కువ సమయమే అంటే.. కేవలం ఐదునెలల కాలంలో పూర్తి చేసి సంక్రాంతి కానుకగా నేడు బుధవారం ప్రేక్షకులముందుకు తీసుకొచ్చారు. గత అర్థరాత్రి నుంచి ఓవర్సీస్‌లో ఎన్టీఆర్ కథానాయకుడు హడావిడి మొదలైపోయింది. ఇక అక్కడ ప్రీమియర్స్ పూర్తి కావడం ఓవర్సీస్ ప్రేక్షకులనుండి పాజిటివ్ రివ్యూస్ రావడమే కాదు.. ఇక్కడ ఏపీలో వేసిన బెన్ఫిట్ షోల నుండి కూడా ఎన్టీఆర్ కథానాయకుడికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. తెలంగాణలో అయితే భ్రమరాంబ థియేటర్‌లో బాలకృష్ణ వేయించిన ప్రత్యేక షోలో ఎన్టీఆర్ టీమ్‌తో పాటుగా బాలయ్య బాబు స్పెషల్ గా వీక్షించాడు.

ఇక ఎన్టీఆర్ కథానాయకుడు కి ఎటు చూసినా పాజిటివ్ టాకే వినబడుతుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరిగింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ 70 కోట్లకు జరగగా.. అంతకు మించిన కలెక్షన్స్ ఎన్టీఆర్ బయోపిక్ కి రావడం ఖాయమంటున్నారు. ఇక సినిమా టాక్ ఎలా వుంది అంటే… ఈ సినిమా ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించడంతో పాటుగా.. ఎన్టీఆర్ నట జీవితాన్ని చూపించారంటున్నారు. ఇక భార్యను ఎన్టీఆర్ ప్రేమించే తీరు, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలతో పాటుగా.. సినిమాల్లో ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఈ సినిమాలో చూపించారంటున్నారు. ఇక బాలకృష్ణ అయితే తండ్రి ఎన్టీఆర్ పాత్రలో అదరగొట్టేసాడట. కుటుంబం కన్నా ఎక్కువగా సినిమాలను ప్రేమించడం.. కొడుకు మరణంలోనూ నిర్మాత నష్టపోకూడనే భావంతో షూటింగ్ కి రావడం.. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు జోలె పట్టి బిక్షమెత్తడం, అలాగే మరో కథానాయకుడు ఏఎన్నార్ – ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు అన్ని హైలెట్ అంటున్నారు.

అలాగే చంద్రబాబు పాత్రధారి రానా అయితే సూపర్‌గా సెట్ అయ్యాడట. ఇక హరికృష్ణ గా ఆయన కొడుకు కల్యాణ్ రామ్ అతికిపోయాడట. ఇక విద్యాబాలన్ అయితే బసవతారకం పాత్రలో జీవించిందని.. సుమంత్ అయితే అక్కినేనిగా చించి ఆరేశాడట. కాకపోతే సినిమా నిడివి ఎక్కువ ఉండడం, అలాగే ఎమోషనల్ సీన్స్ లో కాస్త పట్టులేకపోవడం… సాగదీత సన్నివేశాలు తప్ప సినిమాలో ఒంక పెట్టడానికి లేదంటున్నారు. కథానాయకుడు తో ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వలేదు క్రిష్, బాలకృష్ణ లు అనే మాట వినబడుతుంది. ఏది ఏమైనా కథానాయకుడుతో మహానాయకుడు సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ కలిగేలా క్రిష్ చేసాడంటున్నారు ప్రేక్షకులు, అభిమానులు.