హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

రష్మిక అన్నీ చెబుతుంది కానీ.. ఆ ఒక్కటే?

రష్మిక అన్నీ చెబుతుంది కానీ.. ఆ ఒక్కటే?

Category : Uncategorized

‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక.. రెండో సినిమా ‘గీత గోవిందం’తో బ్లాక్ బాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన ఈముద్దుగుమ్మ తన పేరెంట్స్ తో తనకు ఉండే చ‌నువు.. వారి ద‌గ్గ‌ర త‌న‌కుండే స్వేచ్ఛ గురించి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అంతేకాదు తన ప్రేమ గురించి..బ్రేక్ అప్ గురించి కూడా చెప్పింది.

తనకు తన పేరెంట్స్ దగ్గర చనువు ఎక్కువని.. తన మదర్‌తో ఎక్కువ క్లోజ్ గా ఉంటానని..అమ్మను స్నేహితురాలిగా స‌ర‌దా ఆట ప‌ట్టిస్తుంటాన‌ని చెప్పింది. తన ఫీలింగ్స్ కూడా చెప్పుకుంటానని చెబుతూ..అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు ఎందుకు లేరు అమ్మా.. అని చాలాసార్లు అడిగానంటూ న‌వ్వుతూ చెప్పింది ర‌ష్మిక‌. అంతేకాదు ఈ అబ్బాయి బాగున్నాడా? ఆ అబ్బాయి బాగున్నాడా? అని అమ్మని అడిగిదాన్ని అని చెప్పింది. తాను చేసే సరదా పనులు అమ్మతో కూడా షేర్ చేసుకుంటుందట. ‘కిరాక్ పార్టీ’ సినిమా సమయంలో రక్షిత్ నాకు బాగా క్లోజ్ అయ్యాడని తనపై ఉండే గౌరవం ప్రేమగా మారిందని చెప్పింది.

తన ప్రేమ విషయాన్నీ ఫస్ట్ అమ్మకే చెప్పానని..ఇది సరైన  నిర్ణ‌య‌మేనా? అని అమ్మ‌ను అడిగాన‌ని.. ఎందుకంటే ఈ వ‌య‌సులో కంటికి అంద‌రూ మంచివాళ్లుగానే కనిపిస్తారు. కానీ పేరెంట్స్ మాత్రం ఏది మంచిదో అదే చెబుతుంటారు. నా అభిప్రాయానికి విలువ‌నిస్తూ.. నీ ఇష్టం.. నీకు ఏది నచ్చితే అది చేయ్ అని అమ్మ నాకు భరోసా ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే అది ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లిందని.. ఆ తర్వాత అది బ్రేకప్ అయిందని..కొన్ని పొర‌పాట్లు.. లోటుపాట్లతో అది అక్కడే ఆగిపోయిందని చెప్పింది. బ్రేకప్ అయితే అయింది అని చెప్పింది కానీ దానికి కారణం ఏంటో మాత్రం చెప్పేలేదు రష్మిక.