హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

రాజమౌళి కొడుకు నిర్మాత అయ్యాడు..!

రాజమౌళి కొడుకు నిర్మాత అయ్యాడు..!

Category : Uncategorized

ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశ‌వాణి’

తెలుగు సినిమాని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన ‘షోయింగ్ బిజినెస్’ అనే పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశ‌వాణి’. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తుండ‌గా, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుండి ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

ఈ చిత్రానికి సౌండ్ డిజైన్‌: ర‌ఘునాథ్‌.కె, కాస్ట్యూమ్స్‌: సంజ‌నా శ్రీనివాస్‌, కాస్టింగ్ డైరెక్ట‌ర్‌: మ‌హ‌తి బిక్షు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: మోహ‌న్ నాథ్ ఎస్‌.బింగి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ‌శాంక్‌, స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగ‌రాజు, సందీప్ రాజ్‌, సాయికుమార్ రెడ్డి, నిర్మాత‌: ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ గంగ‌రాజు.