హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

రాజమౌళి-బాలయ్య మూవీ అందుకే ఆగిపోయింది!

రాజమౌళి-బాలయ్య మూవీ అందుకే ఆగిపోయింది!

Category : Uncategorized

షూటింగ్ స్టార్ట్ అయ్యి కనీసం వారం రోజులు కూడా కాలేదు రాజమౌళి RRR సడెన్‌గా ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ స్వల్ప అస్వస్థతకు గురైన రాజమౌళి.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే. ఇక విషయంలోకి వస్తే రాజమౌళి ‘బాహుబలి’ చేస్తున్న టైములో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. వివరాలలోకి వెళ్తే…

‘బాహుబలి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు జక్కన్న – బాలయ్య ఇద్దరు కలిసి కూర్చుని కథలు గురించి మాట్లాడుకుంటున్న టైములో శ్రీకృష్ణ దేవరాయలు కథ ఒకటి కొలిక్కి వచ్చిందట. అది చేయడానికి ఇద్దరు ఓకే అనుకున్నారట. ‘బాహుబలి’ తరువాత దీనిపై పూర్తిగా కూర్చుద్దాం అని జక్కన్న ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీ అయ్యిపోయాడు.

ఆ టైములో తన గురువు అయిన దర్శకులు రాఘవేంద్రరావు రాజమౌళి దగ్గరకు వెళ్లి  శ్రీకృష్ణ దేవరాయలు కథ అనగానే అది బాలయ్యకు తప్ప మరొకరికి బాగుండదు.. ఆ ప్రాజెక్ట్ నేనే చేస్తాను అని చెప్పాడట. గురువుగారు అడగడంతో చేసేది ఏమిలేక బాలకృష్ణతో సినిమా చేసే అవకాశాన్ని వదులుకున్నాడు జక్కన్న. మరి రాఘవేంద్రరావు బాలయ్యతో ఈసినిమా ఎప్పుడు తీస్తారో తెలియాలి. ఇప్పటివరకు దీనిపై ఒక్క అప్ డేట్ కూడా లేదు.