హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

రామ్ చరణ్ కూడా విప్పేస్తున్నాడంట..!!

రామ్ చరణ్ కూడా విప్పేస్తున్నాడంట..!!

Category : Uncategorized

ట్రెండ్ ని ఫాలో అవ్వడంతో మన హీరోస్ ని మించిన వాళ్లు లేరనే చెప్పాలి. ఫ్యాన్స్ కోసం మన హీరోలు ఏది చేయడానికైనా రెడీ అంటున్నారు. గత కొనేళ్లనుండి టాలీవుడ్ సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడుస్తుంది. తమ హీరోస్ ఆలా చొక్కా విప్పి బాడీ చూపిస్తూ.. ఫైట్లు చేస్తే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘అరవింద సమేత’ విషయంలో అదే జరిగింది. సినిమా స్టార్టింగ్ లో ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ ని చూపించడంతో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చాయి. దానికి తోడు ఆ ఫైట్ ఎపిసోడ్ చాలా బాగా తీర్చిదిద్దాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అదే విధంగా మాస్ డైరెక్టర్ బోయపాటి రామ్ చరణ్ ను చూపించనున్నాడని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ తాజాగా ఈ న్యూస్ తో చెర్రీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇందులో చరణ్ బేర్ బాడీతో కనిపించనున్నాడని తెలుస్తుంది. ‘ధృవ’ కోసం బాడీని మంచి షేప్ తెచ్చి ఇంకా బాగా బాడీ పెంచి బోయపాటి సినిమాలో చూపించబోతున్నాడు అని టాక్. ఆ బాడీని ఎలివేట్ చేస్తూ బోయపాటి ఒక యాక్షన్ ఘట్టాన్ని తీర్చిదిద్దాడట. ఈ ఎపిసోడ్ అంతా చరణ్ బేర్ బాడీతోనే ఉంటాడట.