హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

రికార్డుల సంగతేంటో.. చూడు వీరరాఘవా..?

రికార్డుల సంగతేంటో.. చూడు వీరరాఘవా..?

Category : Uncategorized

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత – వీర రాఘవ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది. మరికొన్ని గంటల్లోనే ప్రీమియర్స్ తో హడావిడి స్టార్ట్ చెయ్యబోతున్న అరవింద సమేత మీద బోలెడన్ని అంచనాలున్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో రాయలసీమ భాష హైలెట్ గా నిలుస్తుందనే టాక్ మొదటి నుండి వినబడుతుంది. ఇక రాయలసీమ భాషను ఎన్టీఆర్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో మాట్లాడట. ఇక కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు.. జగపతి అదేనండి అరవింద సమేత విలన్ కేరెక్టర్ చేస్తున్న ఆయన కూడా రాయలసీమ స్లాంగ్ దంచేసాడట. ఇకపోతే అరవింద సమేత సెన్సార్ టాక్.. సెన్సార్ రివ్యూస్ అంటూ అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

ఆ వార్తల సారాంశంను బట్టి అరవింద సమేత ఫస్ట్ హాఫ్ కామెడీతో యావరేజ్ అని.. సెకండ్ హాఫ్ జగపతి బాబు-ఎన్టీఆర్ ల మధ్యన జరిగే యాక్షన్ తో పాటుగా.. ఫ్యామిలీ నేపథ్యంలో జరిగే ఎమోషన్స్ ని త్రివిక్రమ్ అదరగొట్టాడని… అన్నారు. అంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్ – సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అంటూ ఆ వార్తల సారాంశం. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అరవింద ఫస్ట్ హాఫ్ కూడా అదుర్స్ అని.. ఫస్ట్ హాఫ్ లో కామెడీతో మేనేజ్ చేసిన త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ, బంధాలు అనుబంధాలతో… సినిమా మొత్తం ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ.. మనసులకు హత్తుకుపోయేలా తెరకెక్కించాడని.. అంటున్నారు.

సినిమాలో కామెడీకి కాస్తచోటు తక్కువిచ్చిన… ఎమోషన్స్ తోనే సినిమాని త్రివిక్రమ్ ఎక్కడికో తీసుకెళ్లాడని…. ఇక విలన్ గా జగపతి బాబు అదరగొట్టాడని… ఎవరి కేరెక్టర్స్ లో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసారని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ చెప్పినట్టు ఎన్టీఆర్ నటన ఈ సినిమాకే హైలెట్ అనేలా ఉంటుందని… నిజంగానే కొత్త ఎన్టీఆర్ ని చూస్తామని అంటున్నారు. మరి సెన్సార్ తో సినిమాకొచ్చిన పాజిటివ్ టాక్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాశానికి నిచ్చెన లేసేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.