హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘లక్ష్మీస్..’కు తేజ సపోర్ట్..!!

‘లక్ష్మీస్..’కు తేజ సపోర్ట్..!!

Category : Uncategorized

ప్రస్తుతం ఎన్టీఆర్‌పై రెండు బయోపిక్‌లు రూపొందుతున్నాయి. స్వయాన ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ ‘కథానాయకుడు, మహానాయకుడు’ ద్వారా వెంట వెంటనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కథానాయకుడు’కి సెన్సార్‌ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవడంతో పాటు ఇందులో వివాదాస్పద అంశాలేవీ లేవని తేలింది. ఇక ‘మహానాయకుడు’ సంగతి వేచిచూడాల్సివుంది. మరోవైపు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ద్వారా తాను ఎన్టీఆర్‌ జీవితంలోని వాస్తవాలను చూపిస్తానంటూ కాక రేపుతున్నాడు. ఇప్పటికే వెన్నుపోటుపై విడుదల చేసిన పాట, ఆయన ఇస్తున్న స్టేట్‌మెంట్స్‌ పోలీస్‌స్టేషన్ల దాకా వెళ్లింది. మొదట్లో లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్‌ని రెండో వివాహం చేసుకోకముందు గత చరిత్ర, ఆమె మొదట భర్త వీరగంధం నేపధ్యంలో ఆమె నిజజీవితాన్ని బయట పెడతానని చెన్నై తెలుగు యువశక్తి నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ప్రకటించాడు. 

కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ఆ చిత్రం గురించి పెద్దగా మాట్లాడటం లేదు. లక్ష్మీపార్వతి లీగల్‌గానే కాకుండా తనపై బెదిరింపులకు దిగుతోందని ఆయన ప్రకటించడంతో ఆయన సినిమా అటకెక్కినట్లేనని పలువురు భావించారు. ఈ సందర్భంలో ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో మొండివాడుగా, తాననుకున్నది చేసి చూపే మరో వర్మ శిష్యుడు, కొన్ని విషయాలలో గురువును మించే తేజ, కేతిరెడ్డికి అండగా నిలవడం కాకరేపుతోంది. కేతిరెడ్డి ఈ విషయంలో ఇప్పటికే తెలుగు మీడియాకు ప్రెస్‌నోట్‌ పంపడం కలకలం రేపుతోంది. కేతిరెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తేజ తమ స్నేహం గురించి గొప్పగా చెప్పాడు. జయం మూవీస్‌ బేనర్‌లో రూపొందుతున్న ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’కి మద్దతు పలికాడు. 

ఇక తర్వాత కూడా తానే తేజ కుమారుడుని హీరోగా పరిచయం చేస్తూ ఓ భారీ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తానని కేతిరెడ్డి చెప్పడం విశేషం. దీంతో కేతిరెడ్డి-తేజల మధ్య బంధం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో బాలయ్య, ఎన్టీఆర్‌ బయోపిక్‌కి మొదట దర్శకునిగా తేజనే పనిచేశాడు. అయితే బాలయ్యతో క్రియేటివ్‌ డిఫరెన్స్‌లు రావడం, బాలయ్య చెప్పిన ప్రతిసారి ‘జీ హుజూర్‌’ అనడం ఇష్టం లేని తేజ అందుకే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. మరి ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’కి తేజ వంటి మొండోడు మద్దతు తెలుపుతున్నాడంటే ఈ చిత్రం ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తుందనే నమ్మకం పెరుగుతోందనే చెప్పాలి…!