హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

ల‌క్కీ హీరోయిన్ చైతూకు హిట్టిచ్చేనా?

ల‌క్కీ హీరోయిన్ చైతూకు హిట్టిచ్చేనా?

Category : Uncategorized

మ‌న ల‌క్కు బాగోన‌ప్పుడు ప‌క్క‌వారి ల‌క్కుమీద ఆధార‌ప‌డ‌టం అన్న‌ది కామ‌న్‌. ఆ ల‌క్కు చిక్కితే ఫేటు మారిన‌ట్టే. ఇదే సూత్రాన్నిస‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య కోసం వాడుతోంది. `యుద్ధం శ‌ర‌ణం` సినిమా నుంచి నిన్న‌టి `స‌వ్య‌సాచి` వ‌ర‌కు చైతూకు క‌లిసిరావ‌డం లేదు. అత‌న్ని ఈ మ‌ధ్య‌ వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. దీంతో త‌న వ‌ల్లే చైతూకు హిట్టు రావ‌డం లేద‌ని అంతా భావిస్తార‌ని ఊహించిందో ఏమో తెలియ‌దు కానీ చైతూకు హిట్టు రావాలంటే ల‌క్కీ మ‌స్క‌ట‌ర్‌ను వాడాల్సిందే అన్న నిర్ణ‌యానికి స‌మంత వ‌చ్చేసింది. అందు కోసం ల‌క్కీ హీరోయిన్ నిత్యామీన‌న్‌ను రంగంలోకి దింపేసింద‌ట‌. 

`నిన్నుకోరి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య `మ‌జిలీ` పేరుతో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే యువీ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయిపోతున్నాడు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా కోసం స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు జోడీగా నిత్యామీన‌న్ ను సెలెక్ట్‌ చేయాల‌ని యువీ వ‌ర్గాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఓకే చేయించింద‌ట‌. స‌మంత అంత‌గా నిత్యామీన‌న్ నే ఎంచుకోవ‌డానికి కార‌ణం నిత్య ట్రాక్ రికార్డేనని, ఆమె న‌టించిన ఏ సినిమా ఫ్లాప్ అయిన దాఖ‌లాలు లేక‌పోవ‌డం, పైగా సినిమా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డం వ‌ల్లే నిత్య‌ను క‌థానాయిక‌గా ఖ‌రారు చేయించింద‌ని చెబుతున్నారు. వ‌రుస ఫ్లాపుల్లో వున్న చైతూకు నిత్యామీన‌న్ హిట్టిస్తుందేమో చూడాలి.