హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

విజయ్ ఈ సినిమాపై కూడా కాంట్రవర్సీనే..?

విజయ్ ఈ సినిమాపై కూడా కాంట్రవర్సీనే..?

Category : Uncategorized

 

ఈమధ్య పొలిటికల్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. పొలిటికల్ డ్రామా సినిమాలు డీల్ చేసే విధానం తెలియాలి కానీ వాటిపై కూడా వసూల్ భారీ లెవెల్ లో దక్కించుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో పొలిటికల్ డ్రామా సినిమాలు తెర మీదకు రానున్నాయి. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’. ట్రైలర్ బట్టి చూస్తుంటే అది పక్కా పొలిటికల్ డ్రామా అని అర్ధం అవుతుంది. అయితే తమిళ డోస్ ఎక్కువ అయిందని కామెంట్స్ వచ్చిన ఇందులో ద‌క్షిణాది రాజ‌కీయాల ముఖ‌చిత్రాన్ని ఆవిష్క‌రించేశార‌ని టాక్‌. 

అంతేకాదు ఆంధ్ర , తెలంగాణ పాలిటిక్స్ ని కూడా ఇందులో చూపించనున్నారట. విభజన టైములో ఎదురుకున్న పరిస్థితులని ఇందులో చూపించనున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను పోలిన పాత్ర‌లు ఈ సినిమాలో చూడ‌వచ్చ‌ని, వాళ్ల‌ని సైతం పాజిటీవ్ గానే చూపించారని సమాచారం. అంతేకాదు ఇందులో జయలలిత ఎపిసోడ్ కూడా ఉందని టాక్. జయలలిత ఆసుపత్రిలో చనిపోయినప్పుడు అక్కడ ఏమి జరిగిందో ఎవరికి తెలియదు. ఆ ఎపిసోడ్ కి సంబంధించి ఇండైరెక్ట్ గా కొన్ని డైలాగులు పేల్చార‌ట‌.

క‌ర్నాట‌క‌, కేర‌ళ రాజకీయాల్నీ గురించి ఇందులో ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఎవరిని నొప్పించకుండా..ఎక్కడ ఇబ్బంది కలగకుండా.. అర్ధం అయ్యి అర్ధం అవ్వనట్టు ఆ ఎపిసోడ్స్ ని నడిపించారని సమాచారం. అయితే వీటన్నింటిని అసలు నిజంగానే ‘నోటా’ లో చూపించారా అనేది ఇంకా తెలియాల్సిఉంది. ఒకవేళ చూపిస్తే ఆ ఎపిసోడ్స్ సినిమాలో ఏ రేంజ్ లో పండాయో తెలియాలంటే వచ్చే నెల అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే.