హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

వినయ విధేయ రామ సెన్సార్ రివ్యూ

వినయ విధేయ రామ సెన్సార్ రివ్యూ

Category : Uncategorized

ఈవారం విడుదలకు సిద్ధమవుతున్న భారీ చిత్రాల్లో మాస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఏకైక చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ అనంతరం ఈ చిత్రాన్ని చిరంజీవి చూసి విపరీతంగా ఎగ్జైట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఆ స్పెషల్ షో నుంచి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు తెలిసాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ అన్న పాత్ర పోషిస్తున్న ప్రశాంత్ ఎలక్షన్ ఆఫీసర్ అంట.. ఒకసారి ఎలక్షన్స్ కోసం వేరే స్టేట్ వెళ్లినప్పుడు అక్కడ విలన్ వివేక్ ఒబెరాయ్ తో తలపడాల్సి వస్తుందట. ఆ క్రమంలో తమ్ముడు రామ్ కొణిదెల కుటుంబానికి అండగా నిలవడమే కాక.. ఎలక్షన్స్ కి ఎలాంటి అవాంతరం రాకుండా చూసుకుని వివేక్ బలాన్ని, బలగాన్ని ఒడగొట్టి తన కుటుంబంతోపాటు ఒక స్టేట్ మొత్తానికి హీరో అయిపోతాడు. ఇది బేసిగ్గా వినయ విధేయ రామ స్టోరీ. 

ఈ కథకి బోయపాటి మాస్ ఎలివేషన్స్ మరియు ఫైట్ సీక్వెన్స్ లతో సినిమా మొత్తం నిండిపోయిందట. 

అంతా బాగానే ఉంది కానీ.. సెంటిమెంట్ సీన్స్ కాస్త ఓవర్ అయ్యాయని, వాటిని టోన్ డౌన్ చేయమని చెప్పాడట చిరు కూడా. మరి చిరంజీవి చెప్పిన మార్పులు బోయపాటి ఫాలో అవుతాడో లేక తన సినిమాపై ఉన్న నమ్మకంతో ముందుకెళతాడో చూడాలి. మొత్తానికి ఈ సినిమా మరో సరైనోడులా మాస్ ఆడియన్స్ ను ఫుల్ ఫీస్ట్ అని, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం మాత్రం కష్టమేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి సినిమా పరిస్థితి ఏమిటనేది జనవరి 11కి తెలిసిపోతుంది.