హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘వీర‌భోగ వ‌సంత రాయ‌లు’ కొత్త ఒరవడికి శ్రీకారం

‘వీర‌భోగ వ‌సంత రాయ‌లు’ కొత్త ఒరవడికి శ్రీకారం

Category : Uncategorized

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ స‌ర‌న్, శ్రీ‌విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న వీరభోగ వ‌సంత రాయ‌లు అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను ఫ్లైహై సినిమాస్ సొంతం చేసుకుంది. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్ర ప్రీమియ‌ర్స్ ను విడుద‌ల‌కు ఏకంగా మూడు రోజుల ముందే ప్లాన్ చేస్తున్నారు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా అక్టోబ‌ర్ 23నే యుఎస్ ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓవ‌ర్సీస్ మార్కెట్ లో చాలా వేగంగా ఎదుగుతుంది ఫ్లైహై సినిమాస్. ఈ మ‌ధ్యే దేవ‌దాస్ సినిమాను కూడా ఈ సంస్థే విడుద‌ల చేసింది. ఇక వీర‌భోగ వ‌సంత రాయలు విష‌యానికి వ‌స్తే.. ఇది ఒక దేశ‌భ‌క్తి గ‌ల క్రైమ్ థ్రిల్ల‌ర్. ఈ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కించారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావ్ బెల్ల‌న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.