హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

‘వెంకీ మామ’కు డిమాండ్ చేస్తున్నారు!

‘వెంకీ మామ’కు డిమాండ్ చేస్తున్నారు!

Category : Uncategorized

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీమామ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి హీరోస్ కి చెరొక హిట్ ఉండడంతో ఈసినిమా యొక్క రైట్స్ ఎక్కువ చెబుతున్నారు సురేష్ బాబు. సురేష్ బాబు చిన్న సినిమాలనే భారీ ధరలకు అమ్మడం  ప్రత్యేకత. అటువంటిది హిట్ హీరోస్ సినిమా అంటే ఏ రేంజ్ లో అమ్ముతాడో వేరే చెప్పనవసరం లేదు.

ఎఫ్-2తో వెంకీ, మజిలీతో చైతు హిట్ కొట్టారు. వీరిద్దరికి సక్సెస్ లు ఉన్నాయి కాబట్టి వెంకీమామ సినిమాకు భారీ రేట్లు చెబుతున్నాడట. ఈమూవీకి సురేష్ ఒక్కడే నిర్మాత కాదు. టీజీ విశ్వప్రసాద్ కూడా ఉన్నాడు. కాకపోతే బిజినెస్ డీలింగ్స్ అన్ని సురేష్ బాబే చూసుకుంటున్నారు.

రీసెంట్ గా ఈసినిమా యొక్క శాటిలైట్ రైట్స్ కోసం 2-3 ఛానెళ్లు ప్రయత్నించాయి. అయితే సురేష్ బాబు చెప్పిన అమౌంట్ కి షాక్ అయ్యి వెనక్కి వెళ్లిపోయారు. సురేష్ ఎంత డిమాండ్ చేసారో  తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఏకంగా 13 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట సురేష్ బాబు. అదేంటి అని అడిగితే మజిలీ, ఎఫ్2 సినిమా పేర్లు చెబుతున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమాలో హీరోయిన్స్ గా రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు.